• Telugu News
  • /National

Trisha Krishnan : తమిళనాడు బీజేపీ చీఫ్ వ్యాఖ్యలపై నటి త్రిష ఫైర్ !

తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై నటి త్రిష స్పందన. వ్యక్తిగత వ్యాఖ్యలు సరైంది కాదంటూ అధికారిక ప్రకటన విడుదల.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 16, 2026, 5:18 pm IST
Read Time: 5 mins
Trisha Krishnan : తమిళనాడు బీజేపీ చీఫ్ వ్యాఖ్యలపై నటి త్రిష ఫైర్ !

విధాత : టీవీకే పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ ని విమర్శించే క్రమంలో తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ నటి త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అధికారంలోకి వస్తామన్న టీవీకే అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నయనార్ నాగేంద్రన్ ..విజయ్ ముందుగా త్రిష ఇంట్లో నుంచి బయటకు రావాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా నటి త్రిష సోషల్ మీడియా వేదికగా తన న్యాయవాది ద్వారా స్పందించారు. “గౌరవం లేని ప్రవర్తనను ఎప్పుడూ ప్రశ్నించాలి” అని పేర్కొంటూ ఆమె ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

రాజకీయాలకు తనకు సంబంధం లేదని, భవిష్యత్తులో తాను ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం నటి త్రిష స్పష్టం చేశారు. అనవసర వివాదాలలో తనను ఇరికించవద్దన్నారు. రాజకీయాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్న నాగేంద్రన్ వంటి వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఊహించలేదని త్రిష వ్యాఖ్యానించారు. నాగేంద్రన్ వ్యాఖ్యలు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశాయన్నారు. రాజకీయాల కోసం ఇతరులను వ్యక్తిగతంగా విమర్శించడం సరైంది కాదన్నారు.

అంతకుముందు తమ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ టీవీకే అధినేత విజయ్‌ను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు దుమారం రేపాయి. విజయ్ అధికారంలోకి వస్తానని చేసిన ప్రకటనపై నాగేంద్రన్ స్పందించే క్రమంలో .. విజయ్ ముందుగా త్రిష ఇంటి నుండి బయటకు రావాలి అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ చాలా అమాయకుడు. ఇప్పటికీ రాజకీయాలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. మొదటగా అతడు గూడు నుంచి బయటకు రావాలి. మరీ ముఖ్యంగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది’ అని నాగేంద్రన్ వ్యాఖ్యానించారు.

నాగేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తమిళనాడు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. విజయ్‌ని అభిమానించే వాళ్లతో పాటు అధికార డీఎంకే నాయకులు కూడా నాగేంద్రన్ కామెంట్స్‌ని ఖండించారు. విజయ్, త్రిష రిలేషన్ గురించి గత కొన్నాళ్లుగా రకరకాల రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సున్నితమైన అంశాన్ని..రాజకీయ నాయకులు బహిరంగ వేదికలపై ప్రస్తావించడం సరైంది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

నటి త్రిషకు నాగేంద్రన్ క్షమాపణలు

నటి త్రిషకు  తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు  త్రిషపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

Digital Holy Water : టెక్నాలాజీ మాయ.. గుడులలో డిజిటల్ తీర్థం మిషన్లు !
One Rupee Clinic | రూపాయికే పేద‌ల‌కు వైద్యం అందిస్తూ.. ఆద‌ర్శంగా నిలుస్తున్న జంట‌