• Telugu News
  • /National

One Rupee Clinic | రూపాయికే పేద‌ల‌కు వైద్యం అందిస్తూ.. ఆద‌ర్శంగా నిలుస్తున్న జంట‌

ఒడిశా (Odisha)కు చెందిన శంక‌ర్ రామ‌చందానియ (doctor Shankar Ramchandani) అనే వైద్యుడు రూపాయి ఫీజుతో (One Rupee Clini) పేద ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లందిస్తున్నారు. బుర్లా (Burla) మార్కెట్ ప్రాంతంలోని ఓ క్లినిక్‌కు రోజూ సాయంత్రం వెళ్లి పేద‌ల‌కు రూపాయి ఫీజుతో సేవ‌లందిస్తున్నారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 16, 2026, 2:01 pm IST
Read Time: 5 mins
One Rupee Clinic | రూపాయికే పేద‌ల‌కు వైద్యం అందిస్తూ.. ఆద‌ర్శంగా నిలుస్తున్న జంట‌

One Rupee Clini | వైద్యం చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌ది. చిన్న జ్వ‌రం వ‌స్తే ఆసుప‌త్రికి వెళ్లాలంటే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి. ఎందుకంటే డాక్ట‌ర్ ఫీజు, మందుల ఖర్చు, ఇత‌ర టెస్టులు ఇలా ఖ‌ర్చులు త‌డిసి మోపెడ‌వుతాయి మ‌రి. పేద కుటుంబాలకు ఈ ఖర్చులు మితిమీరిన భారం. అందుకే చాలా మంది మెడిక‌ల్ షాప్‌లో గోలీలు తెచ్చుకుని మింగుతుంటారు. అయితే, ఓ వైద్యుడు మాత్రం రూపాయి తీసుకుని (One Rupee Clini) పేద‌ల‌కు వైద్య‌సేవ‌లందిస్తూ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

ప్ర‌స్తుతం రూపాయికి విలువ ఎక్క‌డుంది చెప్పండి. చిన్న‌పిల్ల‌లు సైతం రూపాయి ఇస్తే తీసుకునే ప‌రిస్థితి కాదిది. అలాంటిది ఒడిశా (Odisha)కు చెందిన శంక‌ర్ రామ‌చందానియ (doctor Shankar Ramchandani) అనే వైద్యుడు రూపాయి ఫీజుతో (One Rupee Clini) పేద ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లందిస్తున్నారు. సంబల్‌పూర్‌ (Sambalpur)లో ఉన్న వీర్‌సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌లో (VIMSAR) శంకర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయ‌న భార్య శిఖ దంత‌వైద్యురాలు. అయితే, పేదలకు సేవ చేయాలనే ఆశ‌యంతో డాక్ట‌ర్ శంక‌ర్‌ త‌న క‌ళాశాల విధులు ముగిసిన త‌ర్వాత స్థానికంగా బుర్లా (Burla) మార్కెట్ ప్రాంతంలోని ఓ క్లినిక్‌కు రోజూ సాయంత్రం వెళ్లి పేద‌ల‌కు రూపాయి ఫీజుతో సేవ‌లందిస్తున్నారు.

క‌ళాశాల‌కు వెళ్ల‌డానికి ముందు ఉద‌యం 7 నుంచి 8 వ‌ర‌కూ ఒక గంట‌పాటూ.. మ‌ళ్లీ సాయంత్రం 6 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కూ క్లినిక్‌కు వ‌చ్చిన రోగుల‌కు వైద్యం చేస్తున్నాడు. భార్య డాక్టర్‌ శిఖ సైతం ఆయనకు తోడుగా నిలుస్తూ ఇదే క్లినిక్‌లో పేద‌ల‌కు వైద్యం చేస్తున్నారు. ఈసీజీ, నెబులైజర్‌, ఊపిరితిత్తులను పరీక్షించే స్పైరోమెట్రీ, ఎముకల బలాన్ని గుర్తించే బీఎండీ వంటి టెస్టులు కూడా రూపాయికే చేస్తుండ‌టం విశేషం.

త‌న తండ్రి క్యాన్స‌ర్ బారిన ప‌డిన స‌మ‌యంలో కుటుంబం ప‌డిన ఆర్థిక ఇబ్బందుల‌ను క‌ళ్లారా చూశాన‌ని.. అప్పుడే త‌క్కువ ఖ‌ర్చుతో పేద‌ల‌కు వైద్యం అందించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు డాక్ట‌ర్ శంక‌ర్ తెలిపారు. త‌న త‌ల్లిదండ్రుల జ్ఞాప‌కార్థం కొవిడ్ స‌మ‌యంలో ఈ క్లినిక్‌ను తెరిచిన‌ట్లు వివ‌రించారు. ఇలా పేద‌ల‌కు రూపాయి ఫీజుతోనే వైద్యం అందిస్తూ ఈ జంట అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువురు వైద్య జంట‌ను ప్ర‌శంసిస్తున్నారు. వైద్యం పేరుతో భారీగా సొమ్ము చేసుకునే ఈ రోజుల్లో ఇలాంటి వారుకూడా ఉంటారా..? ఈ జంట నిజంగా గ్రేట్‌.. అంటూ కొనియాడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Women Sell Her Husband For Rs. 1.5 Crores | శుభలగ్నం సీన్ రిపీట్.. భర్తను రూ.1.5 కోట్లకు అమ్మేసిన భార్య
Cotton Harvesting Machine| పత్తి కోత యంత్రం వచ్చేస్తుందోచ్..!