ఒడిశాలోని భువనేశ్వర్‌లో త్రుటిలో పెను రైలు ప్రమాదం తప్పింది. పొట్టెళ్లు, ఎద్దుల ఫైట్ ను తలపించేలా…ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ముఖాముఖి దగ్గరగా ఢీకొన్నాయి. రైళ్లు రెండు కూడా ఒకే ట్రాక్ పైకి రావడంతో సిబ్బంది అప్రమత్తమై సకాలంలో బ్రేక్ లు వేశారు. బ్రేకులు వేసినప్పటికి రెండు రైళ్ల ఎదురెదురుగా ఢీకొనేంత వరకు స్లోగా వచ్చి ఆగిపోయాయి. సిబ్బంది అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఏడాది క్రితం ఛత్తీస్​ గఢ్ ​ బిలాస్​ పూర్ లో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు వచ్చాయి. గటోరా-బిలాస్‌పుర్‌ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న లాల్‌ఖండ్‌ గ్రామ సమీపంలో గత నవంబర్ లో సరకు రవాణా రైలును వెనుక నుంచి ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టింది. ఈ రైలు ప్రమాదంలో 11మందికి పైగా ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనను మరువకే ముందే అదే జిల్లాలో బిలాస్ పూర్ లోనే ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు వచ్చాయి. అప్పటికే ప్యాసింజర్​ ట్రైన్​ ఆగి ఉన్న ట్రాక్ పైకి గూడ్స్​ రైలు వచ్చింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరుగలేదు.