రస్సెల్ వైపర్(రక్తపింజర) విషపూరిత పాముల జాతులలో అతి ప్రమాదకరమైనది. అలాంటి రస్సెల్ వైపర్ ఒకటి, రెండింటిని చూస్తేనే మనుషులకు ఒళ్ల జలధరించి ప్రాణం పోయినంతా పనవుతుంది. కాని ఓ బోర్ వెల్ చాంచర్ గదిలో ఒకేసారి 23 రస్సెల్ వైపర్ పాములు బయటపడటం సంచనంగా మారింది.

ఉదయ్‌పూర్‌లోని దిఖ్లీ గ్రామంలో ఒక బోర్‌వెల్ చాంబర్ గదిలో 23రస్సెల్ పాములను గుర్తించారు. సమాచారం అందుకున్న ‘వైల్డ్ యానిమల్ రెస్క్యూ సెంటర్’ బృందం ఆ ప్రదేశం నుండి 22 పాము పిల్లలను, వాటి తల్లియైన ఒక పెద్ద ఆడ రస్సెల్ వైపర్ పామును సురక్షితంగా బయటకు తీసింది. అత్యంత ప్రమాదరమైన 23 రస్సెల్ వైపర్ పాములను సురక్షితంగా బయటకు తీయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ అరుదైన రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు స్థానికంగా, నెట్టింటా చర్చనీయాంశంగా మారాయి.

“రక్త పింజర”గా పిలిచే రస్సెల్స్ వైపర్.. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన విషపాముల్లో ఒకటి. పొలాలు, గడ్డి పొదలు, రాళ్ల ప్రాంతాల్లో సంచరించే ఈ పాము.. ఒక్క కాటుతోనే ప్రాణాపాయం కలిగించే శక్తి కలిగి ఉంటుంది. రస్సెల్స్ వైపర్ ప్రత్యేకత ఏమిటంటే..ఈ పాము గుడ్లు పెట్టదు. నేరుగా పిల్లలను కంటుంది. ఒకేసారి 20 నుంచి 60 వరకు పిల్లలు పుడతాయని పాముల నిపుణులు చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పుట్టిన చిన్న పాముల్లో కూడా విషం ఉంటుంది. అందుకే చిన్న రస్సెల్స్ వైపర్ కూడా ప్రమాదకరంగానే భావిస్తారు.

రస్సెల్స్ వైపర్ విషం రక్తంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాటు వేస్తే రక్తం గడ్డకట్టే విధానం దెబ్బతింటుంది. అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చికిత్స ఆలస్యం అయితే ప్రాణాపాయం పెరుగుతుంది. అందుకే దీనిని భారతదేశంలో టాప్ 4 విషపాముల్లో ఒకటిగా గుర్తిస్తారు. ఈ పాము చాలా వేగంగా దాడి చేస్తుంది.