ఫ్లై ఓవర్ మీద నుంచి కింద పడ్డ లారీ

మహారాష్ట్ర నాసిక్‌లోని సిన్నార్ MIDC బైపాస్ వద్ద అదుపుతప్పిన లారీ ఫ్లైఓవర్‌పై నుంచి 50 అడుగుల కిందపడింది. డ్రైవర్ గాయాలతో బయటపడగా, ప్రమాదం సీసీటీవీలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 27, 2026, 4:21 pm IST
Read Time: 2 mins
ఫ్లై ఓవర్ మీద నుంచి కింద పడ్డ లారీ

అదుపు తప్పిన ఓ లారీ ఫ్లై ఓవర్ మీద నుంచి కింద పడిపోయి ప్రమాదానికి గురైంది. మహారాష్ట్ర నాసిక్ జిల్లా సిన్నార్‌లోని ఎంఐడీసీ(MIDC) బైపాస్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. లారీ ఫ్లైఓవర్ మీదకు రాగానే అదుపు తప్పి.. రైలింగ్ మీదకు దూసుకెళ్లి.. కాసేపు అక్కడే ఊగిసలాడి 50అడుగుల కిందకు పడింది. అదే సమయంలో ఫ్లై ఓవర్ కింద డీసీఎం సహా పలు వాహనాలు పార్కింగ్ చేసి ఉన్నాయి.

అదృష్టవశాత్తు వాటికి దూరంగానే ఫ్లై ఓవర్ నుంచి లారీ కిందకు పడిపోయింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్ల లేదని తెలుస్తుంది. డ్రైవర్ గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమీప నివాసితులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అధికారులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.