జూలై 29న మహేంద్ర హిల్స్‌ మహాబోధి బుద్ధ విహారలో ధమ్మచక్క పవత్తన దినోత్సవం..

జూలై 29 ఆషాఢ పౌర్ణమి రోజున సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌ మహాబోధి బుద్ధ విహారలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Reported by: Jagan Mohan Talluri | Latest News | Edited by: విధాత హైదరాబాద్ డెస్క్ | Jul 27, 2026, 8:17 pm IST
Read Time: 2 mins
జూలై 29న మహేంద్ర హిల్స్‌ మహాబోధి బుద్ధ విహారలో ధమ్మచక్క పవత్తన దినోత్సవం..

ధమ్మచక్క పవత్తన దినోత్సవం సందర్భంగా ఈ నెల 29 వ తేదీ బుధవారం (ఆషాఢ పున్నమి)నాడు సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లి మహేంద్ర హిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నది. సరిగ్గా ఇదే రోజున బుద్ధుడు మానవాళికి తన మొదటి సందేశాన్ని సారనాథ్‌లో మొదటి ఐదుగురు శిష్యుల ద్వారా అందించారు. మానవ శ్రేయస్సుకు దోహదపడే నాలుగు మహా సత్యాలను, తదనుగుణంగా అనుసరించ వలసిన అష్టాంగ మార్గాన్ని ఈ సందర్భంగా బుద్ధుడు బోధించారు. ఇదే రోజున బుద్ధుడు సంఘ స్థాపన కూడా కావించారు. దీనిని ధమ్మచక్క పవత్తన ఆరంభంగా భావిస్తారు.

ఈ చారిత్రక దినం సందర్భంగా మహా బోధి బుద్ధ విహార ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నది. 12.15 గంటలకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సందేశం అంద చేస్తారు. ధర్మ కాముకులు అందరూ ఈ కార్యక్రమాలకు హాజరు కావాలని మహా బోధి బుద్ధ విహార పిలుపునిచ్చింది. ‪‪‪‪మరిన్ని వివరాల కోసం 72070 72510‬‬‬‬, ‪‪‪7330 915101 నంబర్లను సంప్రదించవచ్చు.

Tags: