అటవీ ప్రాంతాలు..గ్రామాలలో కనిపించే రస్సెల్ వైపర్ (రక్త పింజర) పాము ఏకంగా ముంబై మెట్రో రైలు స్టేషన్ ఫ్లాట్ ఫామ్ పై ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. నిత్యం ప్రయాణికుల రద్దీతో కనిపించే ముంబై – బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మెట్రో లైన్-3 స్టేషన్‌లో అత్యంత విషపూరితమైన రస్సెల్స్ వైపర్ పాము కనిపించింది. బీకేసీ ఆక్వా మెట్రో లైన్ 3 స్టేషన్ బేస్‌మెంట్-2లో రస్సెల్స్ వైపర్ పాము సంచారాన్ని గమనించి సిబ్బంది హడలిపోయారు. పామును గుర్తించిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పాములను రక్షించే నిపుణులను, అటవీ శాఖకు సమాచారం అందించారు.
వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ నీరసంగా బేస్మెంట్ పై పాకుతున్న రస్సెల్ వైపర్ ను చూశారు. ఆ పామును సురక్షితంగా బంధించే ముందు దానికి కొంత నీరు ఇచ్చి..నెమ్మదిగా ఓ సీసాలో దానిని బంధించారు. అటవీ శాఖ మార్గదర్శకాల ప్రకారం దాని సహజ ఆవాసంలోకి తిరిగి వదిలివేశారు.
A Russell’s viper, one of India’s most venomous snakes, was spotted and rescued from Basement-2 of the BKC Aqua Metro Line 3 station in Mumbai on Tuesday morning.
The dehydrated snake was given water before being safely rescued and later released into its natural habitat as per… pic.twitter.com/ISpTkAOAe0
— Rajendra B. Aklekar (@rajtoday) June 23, 2026