విధాత : సముద్రపు పాము(క్రైట్) విషం అత్యంత శక్తివంతం. ఇది రాటిల్ స్నేక్ విషం కంటే సుమారు 10 రెట్లు బలంగా ఉంటుంది. సముద్రపు కట్ల పాము విషం నాడీ వ్యవస్థపై పనిచేసి,వేగవంతమైన పక్షవాతాన్ని కలిగించి, సముద్రపు వేటలో ప్రత్యర్థిగా ఉండే ప్రాణులను తప్పించుకోకుండా నిరోధిస్తుంది. అంతటి శక్తివంతమైన సముద్రపు పాము ఓ మోరే ఈల్ జాతీ పొడవైన చేపపై దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది.
ఒక పగడపు దిబ్బపై సముద్రపు కట్ల పాము(క్రైట్) తనకు సముద్రపు అడుగులో ఎదురుపడిన మోరే ఈల్ పై దాడి చేసింది. దాని కాటు దెబ్బకు మోరే ఈల్ చతికిలపడి పోరాడే శక్తిని కోల్పోయి బలహీన పడటంతో దానిని మింగేందుకు పాము ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. సముద్రపు పాము కంటే ఈల్ బలంగా, అంతే పొడవుతో ఉన్నప్పటికి ప్రత్యర్థి విషంతో బలహీనపడిపోయి దానికి ఆహారంగా మారిపోయింది. సముద్రపు పాము సహజ వేట విధానాలను తెలియజేసే క్రమంలో ప్రకృతి పరిశోధకులు ఈ వీడియోను పోస్టు చేశారు.
One bite ended the hunt. pic.twitter.com/hp9AHrqYjP
— Nature Chapter (@NatureChapter) June 20, 2026