Cotton Harvesting Machine| పత్తి కోత యంత్రం వచ్చేస్తుందోచ్..!

పత్తి పంట సాగు చేసే రైతులకు గుడ్ న్యూస్ వచ్చింది. వరికోత యంత్రాల తరహాలోనే.. త్వరలోనే పత్తి పంట కోత యంత్రాలు పంట పొలాల్లో దర్శనమివ్వనున్నాయి. భోపాల్‌లోని ఐసీఏఆర్(ICAR),సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (CIAE) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పత్తి కోత యంత్రం ఇప్పుడు పత్తి సాగు రైతులకు అందుబాటులోకి వచ్చింది.

Cotton Harvesting Machine| పత్తి కోత యంత్రం వచ్చేస్తుందోచ్..!

విధాత : పత్తి పంట సాగు చేసే రైతులకు గుడ్ న్యూస్(cotton farmers good news) వచ్చింది. వరికోత యంత్రాల తరహాలోనే.. త్వరలోనే పత్తి పంట కోత యంత్రాలు (Cotton Harvesting Machine)పంట పొలాల్లో దర్శనమివ్వనున్నాయి. భోపాల్‌లోని ఐసీఏఆర్(ICAR),సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (CIAE) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పత్తి కోత యంత్రం ఇప్పుడు పత్తి సాగు రైతులకు అందుబాటులోకి వచ్చింది.

శాస్త్రవేత్తలు రూపొందించిన పత్తి కోత యంత్రాన్ని స్వయంగా పరిక్షించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్( Shivraj Singh Chouhan) మహాశివరాత్రి సందర్బంగా దేశ పత్తి రైతులకు అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఈ సందర్బంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ..ఇప్పటివరకు పత్తి కోయడం మానవీయంగా చేయాల్సి వచ్చేదని, దీనికి ఎక్కువ సమయం, శ్రమ, అధిక ఖర్చులు అవసరమవ్వడం రైతులకు భారంగా మారిందన్నారు. పత్తి కోతను సులభతరం చేయడానికి రైతులు చాలా కాలంగా కాటన్ హర్వేస్టర్ యంత్రం కావాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన పత్తికోత యంత్రం.. పత్తి పంట కోతలో రైతులు, రైతు కూలీల శ్రమను తగ్గిస్తుంది, సమయాన్ని, పంట కోతకు కూలీల ఖర్చులను తగ్గిస్తుంది అని వెల్లడించారు.

అలాగే అధిక దిగుబడినిచ్చే, వ్యాధి నిరోధక పత్తి రకాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్లగా ఆయన ప్రకటించారు. రైతు ఆదాయాన్ని పెంచడానికి ఎకరానికి మరిన్ని మొక్కలను నాటే పరిశోధన కూడా కొనసాగుతుందని తెలిపారు.