సీఎం విజయ్- త్రిష బంధం తెగిపోయినట్లేనా..!

విజయ్ పుట్టినరోజున త్రిష శుభాకాంక్షలు చెప్పకపోవడం, ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినట్లు ప్రచారం జరగడంతో విజయ్-త్రిష మధ్య దూరం పెరిగిందా అనే చర్చ నెట్టింట వైరల్ అవుతోంది.

Reported by: Tejaswini Nanna | వినోదం | Jun 23, 2026, 1:01 pm IST
Read Time: 3 mins
సీఎం విజయ్- త్రిష బంధం తెగిపోయినట్లేనా..!

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్ రాజకీయ రంగప్రవేశం మొదలుకుని..సీఎం అయ్యేవరకు కొంత కాలంగా విజయ్- త్రిష మధ్య రిలేషన్‌ షిప్ హాట్ టాపిక్ గా కొనసాగున్న సంగతి తెలిసిందే. భార్యతో విజయ్ విడాకుల కేసు..సీఎం ప్రమాణ స్వీకారం కార్కక్రమంలో త్రిష సందడి చూసిన వారంతా…ఇక విజయ్-త్రిషలు ఒక్కటవుతారని వారి అభిమానులు అంచనాలు వేసుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరూ విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు జూన్‌ 22న విజయ్‌ పుట్టినరోజున త్రిష ఎలాంటి విషేస్ చెప్పకపోవడం నిదర్శనంగా భావిస్తున్నారు.

సీఎం అయ్యాక తొలి పుట్టినరోజు కావడంతో విజయ్ కి సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. త్రిష కూడా విజయ్ కి విషెస్‌ చెబుతుందని ఎదురుచూశారు. ప్రతి సంవత్సరం ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపే త్రిష మాత్రం ఈసారి ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడంతో నెట్టింట కొత్త చర్చ ప్రారంభమైంది. కొన్నేళ్లుగా విజయ్ పుట్టినరోజున ఆయనతో కలిసి దిగిన అరుదైన ఫొటోలను త్రిష పంచుకునే వారు. కానీ ఈసారి ఆమె మౌనంగా ఉండడంతో పాటు.. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేయడం సంచలనంగా మారింది. విజయ్- త్రిష బంధానికి బ్రేకప్ పడిందని, మళ్లీ విజయ్ తన భార్య, కుటుంబంతో కలిసిపోయారన్న చర్చ నెట్టింట జోరందుకుంది. విజయ్- త్రిషల వ్యవహారంపై మునుముందు ఎలాంటి వార్తలు వెలుగులోకి వస్తాయోనంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.