• Telugu News
  • /National

కావేరి జలాల మధ్యలోకి త్రిష..టీవీకే, డీఎంకే శ్రేణుల రాళ్లదాడులు

కావేరి జలాల వివాదం రాజకీయ వేడిని రేపుతుండగా నటి త్రిష పేరు వివాదంలోకి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. టీవీకే, డీఎంకే శ్రేణుల మధ్య తంజావూర్‌లో ఘర్షణలు, రాళ్లదాడులు చోటుచేసుకున్నాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 04, 2026, 1:37 pm IST
Read Time: 3 mins
కావేరి జలాల మధ్యలోకి త్రిష..టీవీకే, డీఎంకే శ్రేణుల రాళ్లదాడులు

కర్ణాటకతో కావేరి నది జలాల వివాదంలో తమిళనాడు రైతుల ప్రయోజనాలు..హక్కుల రక్షణపై అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీల మధ్య కొనసాగుతున్న రచ్చలోకి అనూహ్యంగా నటి త్రిషను లాగడం తమిళ రాజకీయాల్లో ఉద్రిక్తతను రాజేసింది. కావేరి నది జలాల చుట్టూ సాగాల్సిన రాజకీయం కాస్తా..ఇప్పుడు త్రిష చుట్టు సాగుతుంది. కావేరి నది జలాల వివాదంపై తంజావూర్ లో డీఎంకే నిర్వహించిన ప్రదర్శనలో ప్రతిపక్ష డీఎంకే నేత ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సీఎం విజయ్ కి ప్రస్తుతం ఉన్న టెన్షన్ ఒక్కటేనని, అది త్రిష అన్నట్లుగాచేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు తమిళనాట ఉద్రిక్తతలను సృష్టించాయి.

ఉదయ నిధి వ్యాఖ్యలను తప్పుబడుతూ టీవీకే శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసలకు దిగి ఆయన నివాసాన్ని సైతం ముట్టడించాయి. మరోవైపు సీఎం విజయ్ , త్రిషలపైన ఉదయ నిధి చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన తంజావూర్ పోలీసులు చైన్నైకి వచ్చి ఉదయనిధిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు ఉదయనిధికి సంఘీభావంగా డీఎంకే శ్రేణులు సైతం పోటీగా ప్రదర్శనలు చేపట్టాయి.

తంజావూర్ లో రాళ్ల దాడులు

ఉదయ నిధిని తంజావూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకవెళ్లే మార్గంలో దారి వెంట డీఎంకే శ్రేణులు పోలీస్ వాహనాలను అడ్డుకునేందుకు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. తంజావూర్ లో సీఎం విజయ్ దిష్టిబొమ్మను డీఎంకే కార్యకర్తలు దగ్దం చేస్తుండగా…టీవీకే శ్రేణులు అడ్డుపడటంతో ఇరువర్గాల మధ్య రాళ్లదాడులు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఉదయనిధి అరెస్టుకు సంబంధించి చెన్నై కోర్టులో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో కోర్టు తీర్పు వెలువడనుంది.