ఎమ్మెల్యే కుమారుడికి టీవీకే నామకరణం చేసిన సీఎం విజయ్ !

తమిళనాడు సీఎం విజయ్ తన పార్టీ ఎమ్మెల్యే పల్లవి కుమారుడికి ‘తమిళ్ వెట్రి కొండాన్’ అని నామకరణం చేశారు. ఇకపై బాలుడిని సంక్షిప్తంగా ‘టీవీకే’ అని పిలుస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

Reported by: Tejaswini Nanna | వార్త‌లు | Jun 24, 2026, 12:13 pm IST
Read Time: 2 mins
ఎమ్మెల్యే కుమారుడికి టీవీకే నామకరణం చేసిన సీఎం విజయ్ !

తమిళనాడు సీఎం, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ తన పార్టీ ఎమ్మెల్యే కుమారుడికి ఆసక్తికరమైన నామకరణం చేశారు. సోమవారం శాసనసభ కార్యక్రమాలు ముగించుకుని సచివాలయం నుంచి ఇంటికి బయలుదేరిన సీఎం విజయ్ ని తిరు.వి.క.నగర్‌ ఎమ్మెల్యే పల్లవి తన చంటిబిడ్డతో పాటు కలిశారు. విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన బిడ్డకు నామకరణం చేయాలని ఆమె కోరారు.

పసిబిడ్డను చేతుల్లోకి తీసుకున్న సీఎం విజయ్ ‘తమిళ్‌ వెట్రి కొండాన్‌’ అని ఆ పిల్లాడికి నామకరణం చేశారు. విజయ్ పెట్టిన పేరు విషయమై ఎమ్మెల్యే పల్లవి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ‘జననాయగన్‌’ చిత్రంలో విజయ్‌ పాత్రకు ‘వెట్రి కొండాన్‌’ అనే పేరు ఉన్నట్లుగా.. తన బిడ్డకు ‘తమిళ్‌ వెట్రి కొండాన్‌’ అని నామకరణం చేశారని వెల్లడించారు. ఇకపై నా కుమారుడిని సంక్షిప్తంగా టీవీకే అని పిలుస్తామని తెలిపారు. నా బిడ్డకు సీఎం నామకరణం చేయాలనే సుదీర్ఘకాల కల ప్రస్తుతం నెరవేరడం తనకు అమితానందాన్ని కలిగించిందని పల్లవి చెప్పుకొచ్చారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు తర్వాత జన్మించిన తన బిడ్డకు ‘టీవీకే’గా నామకరణం చేయనున్నట్లు ఇదివరకే పల్లవి వెల్లడించడం ఈ సందర్బంగా గమనార్హం.