సీఎం విజయ్ బర్త్ డే.. వారికి ఉచిత బంగారు ఉంగరాలు!

తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ పుట్టిన రోజు వేడుకులను ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఆ రాష్ట్ర మంత్రి శ్రీనాధ్ మాత్రం సీఎం పుట్టిన రోజు నాడు పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలను పంచడం వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Jun 22, 2026, 12:23 pm IST
Read Time: 2 mins
సీఎం విజయ్ బర్త్ డే.. వారికి ఉచిత బంగారు ఉంగరాలు!

తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ పుట్టిన రోజు వేడుకులను ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పుట్టిన రోజు సంబరాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అయితే ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ మాత్రం తమ సీఎం విజయ్ జన్మదిన వేడుకల నిర్వహణలో ప్రత్యేకతను చాటుకున్నారు.

విజయ్ జన్మదిన వేడుకలలో భాగంగా తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం పుట్టినరోజు నాడే జన్మించిన ఆరుగురు నవజాత శిశువులకు స్థానిక ఎమ్మెల్యే, తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ ప్రత్యేకంగా బంగారు ఉంగరాలను బహూకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు రాష్ట్రం అంతా ఇలాగే చేస్తే ఎందరికో మేలు జరిగేదంటూ కామెంట్లు పెడుతున్నారు.