టాక్సీ పనిపై వెళ్లాడు..రూ.3కోట్ల లాటరీ జాక్ పాట్ కొట్టాడు!

ట్యాక్సీ ప్రయాణంపై పక్క రాష్ట్రానికి వెళ్లిన ఓ డ్రైవర్ కు లాటరీలో రూ. 3 కోట్ల జాక్ పాట్ తగిలి కోటీశ్వరుడిగా మారిపోయిన ఘటన వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Jun 22, 2026, 11:02 am IST
Read Time: 2 mins
టాక్సీ పనిపై వెళ్లాడు..రూ.3కోట్ల లాటరీ జాక్ పాట్ కొట్టాడు!

విధాత : అదృష్టం ఉండాలేగాని…ఎవరికి ఏ రూపంలో ఎలాంటి మహార్ధశ లభిస్తుందో చెప్పలేమంటారు పెద్దలు. సరిగ్గా అలాంటి ఘటనే హిమచల్ ప్రదేశ్ కు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ కు ఎదురైంది. పక్క రాష్ట్రానికి ట్యాక్సీ(క్యాబ్) పనిపై వెళ్లిన డ్రైవర్ ఏకంగా రూ.3 కోట్ల అధిపతిగా మారిపోయాడు.

హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రా జిల్లా ఫతేపుర్‌ ప్రాంతానికి చెందిన కల్యాణ్‌చంద్‌ వృత్తిరీత్యా ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల ఓ ప్రయాణికుడిని దింపేందుకు పంజాబ్‌లోని బఠిండాకు వెళ్లాడు. ఈ ట్యాక్సీ ప్రయాణం డ్రైవర్ కల్యాణ్ చంద్ జీవితాన్ని మార్చేసింది. బఠిండాకు వెళ్లిన డ్రైవర్ కల్యాణ్ చంద్ అక్కడ… పంజాబ్‌ రాష్ట్ర సూపర్‌ లాటరీలో రూ.500 విలువైన రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు. అందులో ఒక టికెట్‌కు మొదటి బహుమతి కింద రూ.3 కోట్ల జాక్ పాట్ తగిలింది.

దీంతో సాధారణ ట్యాక్సీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న కల్యాణ్ చంద్ ఒక్కసారిగా కోటీశ్వరుడిగా మారడంతో ఆయన కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ట్యాక్సీ డ్రైవర్ కు తగిలిన జాక్ పాట్ చూసిన వారంతా..అదృష్టం అంటే ఇదేనని అంటున్నారు.