Army Truck | ట్రక్కు లోయలో పడి ఆర్మీ జవాన్ మృతి

జమ్మూకశ్మీర్‌లో ట్రక్కు లోయలో పడి ఖమ్మం జిల్లా ఆర్మీ జవాన్ అనిల్ మృతి. గ్రామంలో విషాదం, కుటుంబం శోకసంద్రం.

Army Truck | ట్రక్కు లోయలో పడి ఆర్మీ జవాన్ మృతి

Army Truck | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ లోయ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో ట్రక్కు లోయలో పడి బానోత్ అనిల్(30) అనే ఆర్మీ జవాన్ మృతి చెందాడు. అనిల్ స్వగ్రామం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్యతండా. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అనిల్ మృతితో సూర్యతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం తోటి జవాన్లతో కలిసి కేక్‌ కట్ చేసి సంబరాలు చేసుకున్నఅనిల్.. భార్య, కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి సరదాగా మాట్లాడారు. కానీ, ఆ మరుసటి రోజే అనూహ్యంగా అతను దుర్మరణం చెందడం కుటుంబసభ్యులు, మిత్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది.

శ్రీనగర్ లో పెట్రోలింగ్ విధుల్లో భాగంగా వాహనంలో వెలుతుండగా..రాయి తగిలి అదుపు తప్పి ట్రక్కు లోయలో పడిపోయింది. తీవ్ర గాయాలైన అనిల్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనిల్ కు భార్య, ఏడు నెలల కుమారుడు ఉన్నారు. అనిల్‌ ప్రయాణించిన వాహనంలోనే ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన మరో జవాను కూడా గాయపడినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి…

మ‌రో మూడు రోజులు స్కూళ్ల‌కు సెల‌వులు..!

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్