Cm Revanth: సీఎం సార్.. నా భూమి కబ్జా చేశారు.. ఆర్మీ జవాన్ వీడియో వైరల్

తన భూమిని కొందరు కబ్జా చేశారని.. ఆ భూమిని విడిపించాలని ఓ ఆర్మీ జవాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీడియో సందేశం పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దేశ సరిహద్దుల్లో తాను పోరాడుతుంటే తన భూమిని కబ్జా చేశారంటూ సదరు జవాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట మండలం చౌదర్ పల్లికి చెందిన రామస్వామి అనే ఆర్మీ జవాన్ ఈ మేరకు వీడియో విడుదల చేశాడు.
చుక్కా రమేశ్ అనే వ్యక్తి ఈ భూమిని కబ్జా చేసినట్టు రామస్వామి కుటుంబసభ్యులు చెబుతున్నారు. కబ్జా దారుడి సోదరుడు వీఆర్వో కావడంతో రెవెన్యూ అధికారులంతా అతడికే వత్తాసు పలుకుతున్నారని వారు అంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కబ్జాదారుడి చెర నుంచి కాపాడాలని కోరుతున్నారు. తన తల్లిదండ్రులను కబ్జాదారులను బెదిరిస్తున్నారని ఆర్మీ జవాన్ వీడియోలో ప్రస్తావించాడు.