Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి వాహన ప్రమాదానికి ఛాన్స్.. జర జాగ్రత్త..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. మీ బుద్ధిబలంతో, సమయస్ఫూర్తితో అందరినీ ఆకర్షిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు సాధించగలరు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన ప్రగతి సాధిస్తారు. అదృష్టం వరించి ఐశ్వర్యవంతులవుతారు. కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. విందు వినోదాలతో ఈ రోజంతా సరదాగా గడిచిపోతుంది. ఆర్థికంగా మేలైన సమయం. ఆదాయంలో వృద్ధి గోచరిస్తోంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికి మనోబలంతో ముందుకు సాగితే అనుకున్న ప్రయోజనాలు నెరవేరుతాయి. మీ పరోపకార గుణం కారణంగా సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరగవచ్చు. ఉద్యోగంలో ఆచి తూచి నడుచుకోవాలి. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. ప్రణాళికా లోపంతో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ప్రారంభించిన పనుల్లో విజయం కోసం కష్టపడాల్సి ఉంటుంది. వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దైవబలం రక్షిస్తోంది. వృత్తి పరమైన ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఉద్యోగులు కీలక వ్యవహారాల్లో తోటివారి సలహాలు పాటిస్తే మంచిది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అనవసర భయాందోళనలు దరిచేరనీయకండి. కుటుంబ వ్యవహారాల్లో సంయమనం పాటించాలి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధాలోపం లేకుండా పని చేయడం వలన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్లారు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. డబ్బు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారం కోసం నిధుల సమీకరణకు అనువైన సమయం.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమిస్తారు. వ్యాపారంలో అద్భుతమైన సమయం. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు వాయిదా వేయండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో తోటివారి సహకారంతో ఆటంకాలు అధిగమిస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారంలో స్థిరమైన నిర్ణయాలతో మేలు జరుగుతుంది. కీలక వ్యవహారాల్లో శాంతంగా నడుచుకోవాలి. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు. సహనం పాటించండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. మీ పట్టుదలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. వృత్తి పరమైన అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. విందు వినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో బద్దకాన్ని వదిలి శ్రమిస్తే విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన పురోగతి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది. ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం భారంగా మారుతుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందున కీలక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో ప్రణాళిక అవసరం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram