Zodiac Signs | ఉగాది నుంచి ఈ మూడు రాశుల వారికి దరిద్రమే..! బీ కేర్ ఫుల్..!!
Zodiac Signs | ఈ నెల 19న ఉగాది పండుగ( Ugadi Festival ) సందర్భంగా పంచాంగ శ్రవణం( Panchanga Sravanam ) నిర్వహిస్తారు. అయితే ఈ పంచాంగం ద్వారా ఆయా రాశుల( Zodiac Signs ) వారు తమ జాతక ఫలాలను తెలుసుకుంటారు. ఆదాయ, వ్యయాలు, అదృష్టం వంటి విషయాలను తెలుసుకుని అందుకనుగుణంగా ప్లానింగ్ చేసుకుంటుంటారు. అయితే ఈ మూడు రాశుల వారికి దరిద్రం వెంటాడనుందని, ఆర్థిక కష్టాలు అధికమయ్యే ప్రమాదం ఉందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు.
Zodiac Signs | తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పర్వదినం( Ugadi Festival ) జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మరి ముఖ్యంగా పంచాంగ శ్రవణం( Panchanga Sravanam ) వినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తెలుగు సంవత్సరం ప్రారంభం సందర్భంగా తమ జాతక ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఆయా రాశుల( Zodiac Signs ) వారు ఆత్రుత చూపిస్తుంటారు. అయితే ఉగాది పండుగ నుంచి ఈ మూడు రాశులకు దరిద్రం వెంటాడనుంది. ఏ పని చేపట్టినా ఆటంకం కలగనుంది. మరి ఆ మూడు రాశులేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
మేష రాశి ( Aries )
ఉగాది పర్వదినం మరుసటి రోజు నుంచి మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం మొదటి దశ ప్రారంభం కానుంది. దీంతో ఈ రాశి వారు మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది. సంపాదించుకున్న డబ్బు నీళ్లలా ఖర్చు కానుంది. ఖర్చులు కూడా స్థాయికి మించి పెరిగిపోనున్నాయి. అనారోగ్య సమస్యలు వెంటాడనున్నాయి. ఏ పని చేపట్టినా ఆటంకం ఏర్పడనుంది. మాట పట్టింపులతో పలువురితో వాగ్వాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు సెప్టెంబర్ నుంచి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
సింహ రాశి ( Leo )
ఉగాది ముందు రోజు వరకు సింహ రాశి వారు ఆర్థికంగా బలపడి ఉంటారు. కానీ ఆ మరుసటి రోజు నుంచి ఆర్థికంగా ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడి ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల వేధింపులు, జీతాలు పెరగక ఆందోళన, పని ఒత్తిడితో విసిగిపోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు ఎంత కష్టపడ్డా.. సరైన ఫలితాలు సాధించలేక మనోవేదనకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు.
కన్యా రాశి ( Virgo )
కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అంతగా కలిసి రావడం లేదు, వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయి. ముఖ్యంగా స్త్రీల వలన ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చికాకు, ఆందోళన, భయం వంటివి కలుగుతాయి. మరీ ముఖ్యంగా ఈ రాశి వారు అవమానకర సంఘటనలు ఎదుర్కొటారు, నమ్మిన వారే మోసం చేసే ఛాన్స్ ఉంది కాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram