Nagpur Explosion| నాగ్ పూర్ లో పేలుడు.. 15మంది దుర్మరణం

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఓ డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు వంటి పేలుడు పదార్ధాలు తయారు చేసే పరిశ్రమ ఎస్‌బీఎల్‌లో జరిగిన పేలుడు ఘటనలో 15మంది దుర్మరణం చెందారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Mar 01, 2026, 11:06 am IST
Read Time: 2 mins
Nagpur Explosion| నాగ్ పూర్ లో పేలుడు.. 15మంది దుర్మరణం

విధాత : మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఓ డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు వంటి పేలుడు పదార్ధాలు తయారు చేసే పరిశ్రమ ఎస్‌బీఎల్‌లో జరిగిన పేలుడు ఘటనలో 15మంది దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో పనిచేస్తున్న కార్మికులలో మరికొందరు గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పరిశ్రమంలోని ఒ యూనిట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని.. ఆ సమయంలో, 30 మందికి పైగా ఉద్యోగులు వివిధ యూనిట్లలో పనిచేస్తున్నారని తెలిపారు.