Holidays | మరో మూడు రోజులు స్కూళ్లకు సెలవులు..!
Holidays | విద్యార్థులకు శుభవార్త( Good News ).. మళ్లీ మూడు రోజులు సెలవులు( Holidays ). లాస్ట్ వీక్‌లో వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. తెగ ఎంజాయ్ చేసిన పిల్లలు( Students ).. ఇప్పుడు కూడా వరుసగా మూడు రోజులు సెలవులు వస్తుండడంతో మళ్లీ ఎంజాయ్ చేసేందుకు అవకాశం దొరికింది.

Holidays | హైదరాబాద్ : గత వారం వరుసగా మూడు రోజులు సెలవులు( Holidays ) రావడంతో విద్యార్థులు( Students ) ఎంజాయ్ చేశారు. శ్రావణ శుక్రవారం, రాఖీ పండుగతో పాటు ఆదివారం కలిసి రావడంతో.. స్కూళ్లు, కార్యాలయాలు మూతబడ్డాయి. ఈ వారంలో కూడా మళ్లీ మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 15న పంద్రాగస్టు( Independence Day ), 16న కృష్ణాష్టమి( Krishnastami )తో పాటు 17న ఆదివారం( Sunday ) రానుంది. దీంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అంటే ఈ వారంలో స్కూళ్లు( Schools ), కార్యాలయాలు పని చేసేది కేవలం నాలుగు రోజులు మాత్రమే. మళ్లీ ఆగస్టు 27న సెలవు రానుంది. ఎందుకంటే ఆరోజు వినాయక చవితి( Vinayaka Chavithi ) కాబట్టి. అంటే ఈ నెలలో మొత్తం ఐదు జనరల్ హాలీడేస్, నాలుగు ఆదివారాలు కలిపి మొత్తం 9 రోజులు సెలవులు వచ్చాయి.
ఈ నెల 15 నుంచి 17 వరకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఉస్మాన్ సాగర్( Osman Sagar ), హిమాయత్ సాగర్( Himayat Sagar )కు వెళ్లొచ్చు. లేదంటే అనంతగిరి( Anantagiri )కి వెళ్లి రావొచ్చు. ఇవన్నీ ఒకే రోజులో చుట్టేయొచ్చు. ఇక నాగార్జున సాగర్( Nagarjuna Sagar ), శ్రీశైలం( Srisailam ), సోమశిల( Somasila )(నాగర్‌కర్నూల్), బొగత, కుంటాల జలపాతం.. వీటిని కూడా సందర్శించొచ్చు. ఇవి రెండు రోజుల పర్యటనలు. కాబట్టి వీలును బట్టి ప్లాన్ చేసుకుంటే.. పిల్లలు పెద్దలు కలిసి ఎంజాయ్ చేయొచ్చు.