Varun Tej | ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ కంబ్యాక్‌పై అంచనాలు.. గ్లింప్స్ అదిరిపోయింది అంతే..!

Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత నాలుగేళ్లుగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ‘మట్కా’ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

  • By: sn |    movies |    Published on : Jan 19, 2026 12:26 PM IST
Varun Tej | ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ కంబ్యాక్‌పై అంచనాలు.. గ్లింప్స్ అదిరిపోయింది అంతే..!

Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత నాలుగేళ్లుగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ‘మట్కా’ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’, హారర్–కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండటంతో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొత్త ప్రయోగం

గతంలో సందీప్ కిషన్‌తో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, శర్వానంద్‌తో ఎక్స్‌ప్రెస్ రాజా, నానితో కృష్ణార్జున యుద్ధం, నితిన్‌తో మాస్ట్రో వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీకి హారర్ టచ్ కలపడం ఆయన స్టైల్ కావడంతో, వరుణ్ తేజ్‌తో ఈ కాంబినేషన్‌పై ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి.

భారీ నిర్మాణం – టెక్నికల్ బలం

ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘మిరాయ్’ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ మూవీని వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

గ్లింప్స్‌లో ఏముంది?

తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. దక్షిణ కొరియాలోని జైలులో కామెడీయన్ సత్యను పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ కనకరాజు ఆచూకీ గురించి ప్రశ్నిస్తారు. అక్కడే ఉన్న హీరోయిన్ రితికా నాయక్ కొరియన్ భాషను అనువదిస్తూ పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఈ క్రమంలోనే హీరో వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చి, ఎదురైన వారిని భయపెట్టేలా నరుక్కుంటూ ముందుకు వెళ్లడం, కొరియన్ భాషలో డైలాగులు చెప్పడం గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచాయి.

వరుణ్ తేజ్‌కు కీలక చిత్రం

వరుస ఫ్లాపుల కారణంగా కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వరుణ్ తేజ్‌కు ‘కొరియన్ కనకరాజు’ చాలా కీలకంగా మారింది. హారర్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకు మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రంతో మెగా ప్రిన్స్ తన నాలుగేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతాడేమో చూడాలి.