Wolf Supermoon | కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని చాలా మంది ఆశిస్తారు. కొత్త సంవత్సరంలో అద్భుతాలు ఉండాలని కూడా ఆశపడతారు. అలాంటివారికి తొలి బహుమతిని అందించేందుకు చందమామ సిద్ధమవుతున్నాడు. జనవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్య నిండైన రూపంతో, మరింత పెద్దగా.. మరింత కాంతివంతంగా కనువిందు చేయనున్నాడు. ఈ ఖగోళ అద్భుత దృశ్యం ఔత్సాహిక ఖగోళ శాస్త్రజ్ఞులు, ఆసక్తి కలిగినవారికోసం ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. ఊల్ఫ్ సూపర్‌మూన్‌గా పిలిచే ఈ ఖగోళ అద్భుతం.. 2026 తొలి సూపర్‌మూన్ కావడం విశేషం. జనవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్య ఈ దృశ్యం కనిపిస్తుంది. అందులోనూ జనవరి 3వ తేదీ సాయంత్రం ఊల్ప్ సూపర్‌మూన్ పీక్ స్టేజ్‌లో ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు మరింత పెద్దగా.. మరింత కాంతివంతంగా కనిపిస్తాడు.
చంద్రుడి కక్ష్య గుడ్రంగా ఉండదు. కోడిగడ్డు ఆకారంలో అంటే.. ఎలిప్టికల్‌గా ఉంటుంది. దాంతో కొన్ని సమయాల్లో భూమికి అంత్యంత సమీపానికి, కొన్ని సార్లు అత్యంత దూరానికి చంద్రుడు వెళుతాడు. నిండు చంద్రుడు భూమికి అత్యంత సమీప పాయింట్‌లోకి వచ్చిన సందర్భాన్ని వూల్ఫ్‌మూన్‌గా నాసా చెబుతున్నది. దీన్నే పెరిజీ అని పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడి వలయం సాధరాణ పౌర్ణమి కంటే సుమారు 14 శాతం పెద్దగా, 30 శాతం కాంతివంతంగా కనిపిస్తుంది.
Real Estate | బ్రోకర్ సహాయం లేకుండానే సొంతింటి కల సాధ్యం..! అదేలాగంటే..?
హైదరాబాద్‌లో జనవరి మూడో తేదీన సాయత్రం సుమారు 5.52 గంటలకు చంద్రోదయం అవుతుంది. సూర్యాస్తమయానికి కాస్త తేడాతో ఉండే ఈ సమయాన్ని ‘బ్లూ అవర్’ అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు అత్యంత సుదరంగా కనిపిస్తాడు. వృత్తిపరమైన, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ఆ దృశ్యం పండగే.
‘వూల్ఫ్ మూన్’ అనేది ప్రాచీన ఐరోపా, నేటివ్ అమెరికన్ జానపదాల నుంచి వచ్చినట్టు వివిధ రిపోర్టులు పేర్కొంటున్నాయి. చల్లని శీతాకాలపు రాత్రుళ్లలో తోడేళ్లు మరింత బిగ్గరగా ఊళ పెడుతూ ఉంటాయి. దీని నుంచే సూపర్ మూన్‌ను వూల్ఫ్ మూన్ అని కూడా పిలుస్తారని లోకోక్తి. అయితే.. తమ ప్రాంతాన్ని గుర్తించేందుకో, తమ గుంపుతో సంభాషించుకునేందుకో తోడేళ్లు ఇలా ఊళ పెడుతుంటాయని అంతేకానీ.. ఆకలితో కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ.. పాతకాలపు జానపద కథలను అనుసరించి.. ఆ పేరు అలానే స్థిరపడిపోయింది.
Toll Relief | విజయవాడ హైవేపై ‘టోల్’ ప్రేమ… తెలంగాణ హైవేలపై మౌనం
హైదరాబాద్‌లో ఉన్నవారికి ఈ తోడేళ్ల ఊళలు వినే అవకాశం లేకున్నా.. సూపర్‌మూన్‌ను మాత్రం సూపర్‌గా ఎంజాయ్ చేయవచ్చు. అందుకోసం ట్యాంక్‌బండ్, దుర్గం చెరువు, గండిపేట చెరువు వంటివి మంచి ప్రదేశాలు కాగలవని నిపుణులు చెబుతున్నారు. బిర్లా ప్లానెటరియం ఉన్న నౌబత్ పహాడ్ కూడా మంచి ప్లేస్ అంటున్నారు. నేరుగా కళ్లతో ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు.. ఎలాంటి ప్రత్యేక పరికరాలు, కండ్ల అద్దాలు అవసరం లేదు. చెట్లు, కొండలు, పెద్ద భవనాలు ఉన్న చోట చంద్రుడిని చూసినప్పుడు మరింత పెద్దగా వీక్షిస్తున్న భావన కలుగుతుంది. మంచి వీక్షణానుభవం కావాలంటే.. తూర్పు దిశలో ఎలాంట అడ్డంకులు లేని ప్రదేశాన్ని ఎంచుకోండి. బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉంటే చంద్రుని ఉపరితల వివరాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి..
Ibomma Ravi : ఐబొమ్మ రవి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
Muslim Woman Dance In Old City : పాతబస్తీ వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మైనార్టీ మహిళా డాన్స్ వైరల్
Zodiac Signs | 2026లో భర్తల జీవితాల్లో వెలుగులు నింపనున్న ఈ మూడు రాశుల భార్యలు..!
