Revanth Reddy| ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల సరళిని ప్రియాంకగాంధీకి వివరించారు.

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల సరళిని ప్రియాంకగాంధీకి వివరించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డంపై ప్రియాంక గాంధీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

రేవంత్ రెడ్డిని ఆమె ప్ర‌త్యేక్యంగా అభినందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి ఘ‌న విజ‌యం క‌ట్ట‌బెట్టార‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి తెలియ‌జేశారు.

అంతకుముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీలను కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయాలపై చర్చించారు. కేంద్ర మంత్రులతో భేటీ సందర్బంగా తెలంగాణకు రావాల్సిన నిధులు, అభివృద్ది పనుల ఆమోదాలపై చర్చించారు.

Latest News