Aliens Are Real : Obama |  గ్రహాంతరవాసులు నిజమే : ఒబామా సంచలన వ్యాఖ్యలు.. Area 51లో లేరని స్పష్టం

“గ్రహాంతరవాసులు నిజమే” అన్న బరాక్ ఒబామా వ్యాఖ్య తీవ్రంగా వైరల్ అయింది. Area 51లో ఎటువంటి రహస్య కేంద్రం లేదని, తన అధ్యక్ష పదవిలో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మిన్నెసోటా ICE చర్యలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Former US President Barack Obama says aliens are real during viral podcast interview

Obama Says ‘Aliens Are Real,’ Clarifies No Evidence of Area 51 Secret

సారాంశం:

“ఏలియన్స్ నిజమే” అన్న బరాక్ ఒబామా వ్యాఖ్య వైరల్ అయింది. అయితే Area 51లో రహస్య కేంద్రం లేదని, తన అధ్యక్ష పదవిలో ఎటువంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

మిన్నెసోటా ICE ఆపరేషన్లపై కూడా ట్రంప్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 

విధాత సైన్స్​ డెస్క్​ | హైదరాబాద్​:

Aliens Are Real : Obama |  అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ఒక వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. “గ్రహాంతరవాసులు ఉండటం నిజమే” అని ఆయన ఒక పాడ్​కాస్ట్​లో చెప్పడంతో సోషల్ మీడియాలో  చర్చలు మొదలయ్యాయి. అయితే ఆయన “నేను చూడలేదు.. నా అధ్యక్ష పదవీకాలంలో ఎలాంటి ఆధారాలు లేవు” అని స్పష్టం చేశారు.

యూట్యూబర్ బ్రయన్ టైలర్ కోహెన్(Brian Tyler Cohen) నిర్వహించిన ఇంటర్వ్యూలో ‘గ్రహాంతరవాసులుండటం నిజమేనా?(Are aliens real?)’ అన్న ప్రశ్నకు ఒబామా అవును..నిజమే(‘They’re real’) అని సమాధానం ఇచ్చారు. కానీ అది విశ్వ పరిమాణాన్ని ఉద్దేశించిన వ్యాఖ్య అని తరువాత వివరణ ఇచ్చారు. విశ్వం ఎంతో విస్తారంగా ఉండటంతో ఎక్కడో జీవం ఉండే అవకాశం ఉందని, కానీ భూమిని ఏలియన్స్ సందర్శించినట్టు ఆధారాలు లేవని చెప్పారు.

తన పదవీకాలంలో (2009–2017) జాతీయ భద్రతకు సంబంధించిన అతిగోప్య సమాచారాన్ని పరిశీలించినప్పటికీ ఎలాంటి నిర్ధారిత సమాచారం లభించలేదని తెలిపారు.

‘ఏరియా 51లో ఎలాంటి గ్రహాంతరవాసులు లేరు​

ఏరియా 51 గురించి కూడా ఒబామా స్పష్టంగా స్పందించారు. “ఏరియా 51లో ఎలాంటి భూగర్భ ప్రయోగశాల కానీ, అలాంటి సౌలభ్యం కానీ లేదు. అలాంటి భారీ రహస్య నిర్మాణం ఉంటే అది అధ్యక్షుడికి తెలియకుండా ఉండదు” అని అన్నారు. కానీ చాలామంది ఆ ప్రాంతంలో గుర్తించని ఖగోళ వస్తువులను(UFO – Unidentified Flying Objects) చూసామని చెప్పారు.

ఏంటీ ఏరియా 51.?

Area 51 అనేది అమెరికా దేశంలోని నెవాడా రాష్ట్రంలో ఉన్న అత్యంత గోప్యమైన సైనిక స్థావరం. ఇది లాస్ వెగాస్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో, గ్రూమ్​ లేక్​(Groom Lake) ఎడారి ప్రాంతంలో ఉంది. అధికారికంగా ఇది Nevada Test and Training Range‌లో భాగం. ఈ స్థావరాన్ని అమెరికా వైమానిక దళం (US Air Force) నిర్వహిస్తుంది.

ఇక్కడ ప్రధానంగా రహస్య యుద్ధ విమానాల పరీక్షలు, గుప్త సాంకేతికతల అభివృద్ధి, అధునాతన రక్షణ పరికరాల ప్రయోగాలు నిర్వహిస్తారు. 1950ల నుంచి ఈ కేంద్రం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. U-2 స్పై ప్లేన్, F-117 Nighthawk వంటి విమానాల అభివృద్ధి, పరీక్షలు ఇక్కడే జరిగాయి. ఈ కారణంగా అక్కడి కార్యకలాపాలు అత్యంత గోప్యంగా ఉంచబడుతున్నాయి. Area 51 చుట్టూ భద్రత చాలా కఠినంగా ఉంటుంది. సాధారణ ప్రజలకు ప్రవేశం పూర్తిగా నిషేధం. హెచ్చరిక బోర్డులు, పర్యవేక్షణ కెమెరాలు, భద్రతా సిబ్బంది ఎప్పుడూ అక్కడ గస్తీ కాస్తుంటారు.

ఇదే గోప్యత కారణంగా Area 51 చుట్టూ UFOలు, ఏలియన్స్ గురించిన కథలు, వదంతులు, ఊహాగానాలు దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్నాయి. అక్కడ గ్రహాంతర జీవులను దాచిపెట్టారనే వాదనలు వినిపిస్తాయి. అయితే ఇప్పటివరకు అలాంటి ఆరోపణలకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. 2013లో అమెరికా ప్రభుత్వం Area 51 ఉనికిని అధికారికంగా అంగీకరించినప్పటికీ, అది ఒక సైనిక పరీక్షా కేంద్రం మాత్రమేనని స్పష్టం చేసింది.

ఒబామా గతంలో కూడా ఆయన టెలివిజన్ కార్యక్రమాల్లో ఇదే విషయాన్ని సరదాగా ప్రస్తావించారు. అయితే UAP (Unidentified Aerial Phenomena)గా గుర్తించిన కొన్ని ఖగోళ వస్తువుల వీడియోలు ఉన్నాయని, అవి ఏమిటో స్పష్టత లేదని ఒకసారి వ్యాఖ్యానించారు.

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, విశ్వంలో బిలియన్ల గెలాక్సీలు ఉన్నప్పటికీ, భూమికి ఏలియన్స్ వచ్చినట్లు ఇప్పటివరకు సరైన ఆధారాలు లేవు. కానీ, ఈమధ్య కాలంలో అమెరికా ప్రభుత్వం అంతుబట్టని ఖగోళ విషయాల గురించి కొన్ని పత్రాలు విడుదల చేసినప్పటి నుండి ప్రజలకు ఈ విషయంపై ఆసక్తి ఎక్కువైంది.

మిన్నెసోటా ఘటనలపై ఘాటు విమర్శలు

ఇంటర్వ్యూలో ఒబామా మిన్నెసోటాలో జరిగిన వలస నియంత్రణ చర్యలపై కూడా స్పందించారు. ICE ఏజెంట్ల ప్రవర్తనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

“ఇది అమెరికా కాదు. నియంతృత్వ దేశాల్లో కనబడే విధానం ఇది” అని వ్యాఖ్యానించారు. కుటుంబాలపై అకస్మాత్తుగా దాడులు, చిన్నారులను ఒత్తిడికి గురిచేయడం వంటి చర్యలు ఆందోళనకరమని అన్నారు. తాజా కాల్పుల ఘటనల నేపథ్యంలో ఆ ఆపరేషన్‌ను ముగిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో మరోసారి వాదోపవాదాలు మొదలయ్యాయి.

ఒక లైట్‌నింగ్ రౌండ్ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం పెద్ద చర్చకు దారి తీసినా, చివరికి సందేశం ఒకటే —విశ్వంలో జీవం ఉండే అవకాశముంది. కానీ భూమిపై గ్రహాంతరవాసులు ఉన్నట్టు లేదా Area 51లో దాచినట్టు ఎలాంటి ఆధారాలు లేవు.

Latest News