Ayatollah Khamenei : ఖమేనీ మరణం..ఆ మహిళల వీడియోలు వైరల్

ఖమేనీ మరణంతో ఇరాన్‌లో స్వేచ్ఛా గీతం. రోడ్లపై యువతుల డ్యాన్స్.. సిగరెట్లు కాలుస్తూ నిరసన. 30 ఏళ్ల ఆంక్షలు తుడిచిపెట్టుకుపోయాయంటూ సంబరాలు. వైరల్ అవుతున్న వీడియోలు.

విధాత : అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమైన వీడియోలు, వార్త కథనాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సంచలనం రేపాయి. అయితే ఖమేనీ మరణంతో ఇరాన్ లో ఓ వైపు నిరసనలు, మరోవైపు సంబరాలు వ్యక్తమైన భిన్న వాతావరణం కనిపించింది. ఖమేనీ మతం ముసుగులో ఇరాన్ ప్రజల స్వేచ్చ, హక్కులను హరించి నియంత పాలనా సాగించారంటూ ప్రజాస్వామిక వాదులు..ముఖ్యంగా ఆ దేశపు యువత, మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమేని మరణ వార్త వారిలో సహజంగానే హర్షాతిరేకాలు రగిలించింది.

ఈ క్రమంలో ఓ యువతి ఖమేనీ ఫోటోతో సిగరేట్ కాల్చుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అదే రీతిలో ఖమేనీ మృతి వార్తతో ఇరాన్ యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అయ్యింది. ఖమేనీ మరణ వార్త రూఢీ చేసుకున్న తరువాత టెహ్రాన్ యూనివర్సిటీలో రీసెర్చ్ విద్యార్థినులు డ్యాన్సులు చేశారు. ఖమేనీ పాలనతో ఇరాన్ లో గత 30ఏళ్లుగా బాలికలు, మహిళలు డ్యాన్స్ చేయడం అనేది నిషేధించబడింది. ఖమేనీ అంతంతో ఇరాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని అక్కడి యువత, విద్యార్థులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

సూర్యాపేట జిల్లాలో మైనింగ్ స్కామ్ : సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖ
Trisha | విజయ్ విడాకుల వార్తల మధ్య TVK లో త్రిష పేరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న థియరీలు

Latest News