Petrol and Diesel | దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులపై పెరుగుతున్న భారం

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. కేవలం 10 రోజుల వ్యవధిలో ఇది మూడోసారి ధరల పెరుగుదల కావడం గమనార్హం.

Reported by: Sandeep | జాతీయం | May 23, 2026, 7:33 am IST
Read Time: 4 mins
Petrol and Diesel | దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులపై పెరుగుతున్న భారం

Petrol and Diesel | దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ Diesel ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ నూతన ధరలను నేడు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి తీసుకువచ్చాయి. తాజా సవరణల ప్రకారం లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరిగాయి. రాజధాని ఢిల్లీలో తాజా ధరల ప్రకారం పెట్రోల్ ధర లీటరుకు రూ.99.54కు చేరుకోగా, డీజిల్ ధర రూ.92.48గా నమోదైంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా స్థానిక పన్నులు, రవాణా వ్యయాల ఆధారంగా ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా మారింది.

మ‌రింత పెరిగే ఛాన్స్..

ఇంధన ధరల పెరుగుదల ఇటీవల తరచుగా చోటుచేసుకుంటోంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మూడోసారి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొదట ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్‌పై ఏకంగా రూ.3.50 వరకు పెంపు చేపట్టాయి. అనంతరం ఈ నెల 19వ తేదీన మరోసారి పెట్రోల్‌పై Petrol 87 పైసలు, డీజిల్‌పై  l 91 పైసలు పెంచాయి. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో పెంపు అమలు చేయడంతో వాహనదారుల ఖర్చులు మరింత పెరిగాయి. ఈ వరుస ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ముడి చమురు ధరల మార్పులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. రోజుకు సుమారు రూ.1,000 కోట్ల వరకు నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి.

ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. కనీసం లీటరుకు రూ.25 వరకు ధరలను పెంచాల్సి రావచ్చని కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతుందా అనే ఆందోళన వాహనదారుల్లో వ్యక్తమవుతోంది. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై Rates  కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సామాన్య ప్రజల జీవన వ్యయం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.