Vegetables Rates | కొండెక్కిన ‘బీర‌కాయ‌’.. భ‌గ్గుమంటున్న ‘ప‌చ్చిమిర్చి’

Vegetables Rates | హైద‌రాబాద్ న‌గ‌రంలో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. కొన్ని వెజిట‌బుల్స్ ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు కూడా కొన‌లేని స్థాయికి కూర‌గాయ‌ల ధ‌ర‌లు భారీగా పెరిగాయి.

Reported by: raj | తెలంగాణ‌ | Jun 06, 2026, 7:13 am IST
Read Time: 2 mins
Vegetables Rates | కొండెక్కిన ‘బీర‌కాయ‌’.. భ‌గ్గుమంటున్న ‘ప‌చ్చిమిర్చి’

Vegetables Rates | హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. కొన్ని వెజిట‌బుల్స్ ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు కూడా కొన‌లేని స్థాయికి కూర‌గాయ‌ల ధ‌ర‌లు భారీగా పెరిగాయి. దీంతో గృహిణులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇలానే కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెరిగితే.. చివ‌ర‌కు గొడ్డుకారం వేసుకుని తినాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని ఆవేద‌న చెందుతున్నారు. బీర‌కాయ‌, బెండ‌కాయ ధ‌ర‌లు వంద రూపాయాలు దాటేశాయి. నిత్యం వినియోగించే ట‌మాటా, ప‌చ్చి మిర్చి ధ‌ర‌లు కూడా రూ. 50పైనే ప‌లుకుతున్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఇలా..

చిక్కుడు రూ.120
బీరకాయ రూ.105
బెండకాయ రూ.85
పచ్చిమిర్చి రూ.70
వంకాయ రూ.75
గోకర రూ.75
చామగడ్డ రూ.75
దొండకాయ రూ.60
క్యాబేజీ రూ.65
కీర రూ.60
టమాట రూ.54
దోసకాయ రూ.55

కూర‌గాయ‌ల‌ ధరల పెరుగుదలకు అధిక ఉష్ణోగ్రతల కారణంగా దిగుబడులు తగ్గడం ప్రధాన కారణమైతే… ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో పెరిగిన డీజిల్‌ ధరలు మరో కారణమని వ్యాపారులు చెబుతున్నారు.