Trisha | విజయ్ విడాకుల వార్తల మధ్య TVK లో త్రిష పేరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న థియరీలు

Trisha | తమిళ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెల‌సిందే. రీసెంట్‌గా ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

  • By: sn |    movies |    Published on : Mar 02, 2026 12:18 PM IST
Trisha | విజయ్ విడాకుల వార్తల మధ్య TVK లో త్రిష పేరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న థియరీలు

Trisha | తమిళ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెల‌సిందే. రీసెంట్‌గా ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దాదాపు రెండున్నర దశాబ్దాల వివాహ బంధానికి ముగింపు పలకాలని ఆమె నిర్ణయించుకున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్‌కు ఒక ప్రముఖ నటితో సన్నిహిత సంబంధం ఉందన్న గాసిప్స్ మళ్లీ సోషల్ మీడియాలో తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరును నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.

గతంలో వీరిద్దరూ కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించడంతో, అప్పటినుంచే వీరి మధ్య ప్రేమ ఉందన్న పుకార్లు వినిపించాయి. అయితే ఈ విషయంపై విజయ్ గానీ, త్రిష గానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో పాత ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఈ అంశాన్ని మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు.

TVK పార్టీ పేరుపై కొత్త థియరీ

ఇలాంటి సమయంలో విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) పేరు కూడా కొత్త చర్చకు దారితీసింది. కొందరు నెటిజన్లు సరదాగా ఒక థియరీని ముందుకు తెచ్చారు. త్రిష పూర్తి పేరు ‘త్రిష కృష్ణన్’. దానిలో ‘త్రిష – విజయ్ – కృష్ణన్’ అనే మూడు పేర్ల మొదటి అక్షరాలు కలిపితే TVK అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. దీంతో పార్టీ పేరుకు త్రిషతో సంబంధం ఉందా? అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మరికొందరు మాత్రం ఇది పూర్తిగా ఓవర్ థింకింగ్ మాత్రమేనని, పార్టీ పేరుకు స్పష్టమైన రాజకీయ అర్థం ఉందని, దానిని వ్యక్తిగత జీవితంతో లింక్ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఈ థియరీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది.

కుమారుడు జేసన్ సంజయ్‌పై కూడా ప్రచారం

విజయ్ కుటుంబానికి సంబంధించిన మరో ప్రచారం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో తండ్రిని అన్‌ఫాలో చేశాడని టాక్ వినిపిస్తోంది. దీనిని కొందరు విజయ్ వ్యక్తిగత వివాదాలతో లింక్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు.

జేసన్ సంజయ్ నటుడిగా కాకుండా దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సిగ్మా’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

త్రిష పాత ఇంటర్వ్యూ మళ్లీ వైరల్

ఈ వివాదాల మధ్య త్రిష కృష్ణన్ పాత ఇంటర్వ్యూ ఒకటి మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ, “సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. నచ్చని వ్యక్తితో జీవించడం కంటే ఒంటరిగా ఉండటం మంచిది” అని చెప్పిన వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ గుర్తు చేస్తున్నారు. కొందరు ఈ మాటలను విజయ్ పరిస్థితులతో లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

అయితే ఇప్పటివరకు ఈ మొత్తం అంశాలపై సంబంధిత వ్యక్తుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చర్చలు ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.