Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి సొంతింటి క‌ల నెర‌వేరుతుంది..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ హృదయంలో ఆనందం నింపుతుంది. మిత్రులతో కలిసి రోజంతా ఆనందంగా గడుపుతారు. గృహ సంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా ఈ రోజు అనేక ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని శుభ ఫలితాలు అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలంతో ఆర్థికంగా పుంజుకుంటారు

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు మీ వృత్తిజీవితం ఓ కీలక ఘట్టానికి చేరుతుంది. ఉద్యోగులకు బదిలీ, ప్రమోషన్, జీతం పెంపు వంటి ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి పరంగా మీ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో స్వల్ప ఒడిదుడుకులు ఉండవచ్చు. సమయానుకూల నిర్ణయాలతో మేలు జరుగుతుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతిపనిలోను ఉత్సాహంగా ముందుకు సాగడం వల్ల ప్రయోజనం పొందుతారు. పాత పరిచయాలు, స్నేహాలను పునరుద్ధరించుకునేందుకు, కొత్త పరిచయాలు పెంచుకునేందుకు ఇది మంచి సమయం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు ఉండవు. సొంత ఇంటి కల నెరవేరుతుంది.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన అవకాశాలు అందుకుంటారు. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. బంధుమిత్రులతో అనుబంధం దృఢ పడుతుంది. వృత్తి పరమైన చర్చలు, సమావేశాల్లో మీ వాగ్ధాటితో అందరినీ మెప్పిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన సమయం నడుస్తోంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతస్థితి లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రశాంతత పొందుతారు. వ్యాపారంలో అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే ఆశించిన ప్రయోజనాలు అందుకోవచ్చు. ఆర్థికంగా పుంజుకుంటారు. ధనలాభాలు పెరుగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మనోధైర్యంతో లక్ష్యాలను సాధిస్తారు. మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ధనధాన్య లాభాలున్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలున్నప్పటికీ సమర్ధవంతంగా అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వలన నష్టపోతారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. అయితే మీ కఠోర శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. శుభకార్యక్రమాల్లో ఆనందంగా గడుపుతారు. ఆదాయవృద్ధితో ఆర్థిక నిల్వలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సున్నితంగా, లోక్యంగా వ్యవహరించడం వల్ల అపార్ధాలు తొలగుతాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో వరుస అపజయాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. డబ్బు నష్టపోకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ కలహాలు రాకుండా కోపం అదుపులో ఉంచుకోవాలి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది.

Latest News