Site icon vidhaatha

Akhanda2| అఖండ2లో జ‌గ‌న్‌ని ఓ రేంజ్‌లో బాల‌య్య చెడుగుడు ఆడనున్నాడా…!

Akhanda2| అఖండ‌.. ఈ చిత్రం బోయపాటి కెరీర్ లో నే అతి పెద్ద హిట్. ఇందులో బాల‌య్య డ్యూయ‌ల్ పాత్ర‌లో కనిపించి మెప్పించారు. ఇందులో అఘోరా పాత్ర సినిమాకి హైలైట్ అని చెప్పాలి. బాలయ్య అఘోరా పాత్ర‌లో న‌ట విశ్వ‌రూపం చూపించారు. ఇక సినిమాకి థ‌మ‌న్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ‌రో లెవ‌ల్. కొన్ని చోట్ల బాక్సులు కూడా బ‌ద్ద‌లు అయ్యాయి. అఖండ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేయ‌డంతో అఖండ‌2 గురించి కొన్నాళ్లుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది, ఇందులో ఏయే పాత్ర‌ల‌ని ఎక్కువ‌గా హైలైట్ చేస్తాడోనని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

బాల‌య్య ప్ర‌స్తుతం త‌న 109వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తైన వెంట‌నే అఖండ‌2ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే బోయ‌పాటి మూవీ స్క్రిప్ట్‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ట‌. ఇక ఈ సినిమాలో ఏపీ రాజ‌కీయాన్ని ట‌చ్ చేస్తున్నారట‌. బ్యాక్ డ్రాప్ స్టోరీ అంతా ఏపీ పాలిటిక్స్ మీద‌నే న‌డుస్తుంద‌ని..అండ‌ర్ క‌రెంట్ గా హిందుత్వాన్ని ట‌చ్ చేస్తాడ‌ని టాక్ న‌డుస్తుంది. క‌థ‌లో రాజ‌కీయాల గురించి, ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు ఉంటాయ‌నే టాక్ వినిపిస్తుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు రాయించాల‌ని బోయ‌పాటి ఫిక్స్ అయ్యారట‌.

ఆ డైలాగుల‌ని బాల‌య్య చేత చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా చెప్పించాల‌ని బోయ‌పాటి డిసైడ్ అయ్యార‌ట‌.అంతేకాదు గ‌త ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించేలా కొన్ని పాత్ర‌ల‌ని కూడా తెర‌పై చూపించ‌బోతున్నార‌ట‌. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేని నేప‌థ్యంలో ఈ సారి వైసీపీ ప్ర‌భుత్వాన్ని అఖండ‌2 ద్వారా గ‌ట్టిగా టార్గెట్ చేయ‌బోతున్నాడ‌ని ఇప్పుడు నెట్టింట ఓ వార్త వైర‌ల్‌గా మారింది. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపొందించే అవ‌కాశం ఉంది. హిందుత్వ కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ‘అఖండ’ నార్త్ కి కూడా బాగా క‌నెక్ట్ అవ్వ‌డంతో రెండ‌వ భాగాన్ని ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తుంది.

Exit mobile version