Site icon vidhaatha

Ali| రాజ‌కీయాల నుండి త‌ప్పుకున్నాక మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప్రేమ ఒల‌క‌బోస్తున్న ఆలీ

Ali| సినీ నటుడు ఆలీ క‌మెడీయ‌న్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న కామెడీని ప్ర‌తి ఒక్క‌రు ఎంజాయ్ చేస్తారు. అయితే సినిమాలు చేస్తూనే రాజ‌కీయాల‌లోకి కూడా అడుగుపెట్టాడు ఆలీ. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి.. దాదాపు 20 ఏళ్ల పాటు ఆపార్టీలోనే కొనసాగిన త‌ర్వాత 2019లో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక ఆలీకి 2022లో ఏపీ ఎలక్రానిక్ మీడియా సలహాదారుడిగా నామినేటెడ్ పదవి ద‌క్కింది. 2024లో ఆలీ ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావించ‌గా, ఆయ‌న‌కి సీటు ద‌క్క‌లేదు. మ‌రోవైపు ఈ ఎన్నిక‌ల‌లో టీడీపీ-జనసేన కూటమి అఖండ విజయాన్ని సాధించగా.. అలీ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కేవ‌లం నటుడిగా కొనసాగుతానని స్పష్ఠం చేశారు.

అయితే ఆలీ వైసీపీ పార్టీలో ఉన్న స‌మ‌యంలో కొన్నిసార్లు ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. పవన్ కల్యాణ్ సైతం అలీ కూడా నన్ను మోసం చేశాడని విమర్శించారు. అలా ఇద్ద‌రి మ‌ధ్య కాస్త దూరం పెరిగింది. ఒక‌ప్పుడు ప‌వ‌న్ న‌టించిన ప్ర‌తి సినిమాలో ఆలీ ఉండాల్సిందే. కాని త‌ర్వాత దూరం పెర‌గ‌డంతో ప‌వ‌న్ చేస్తున్న సినిమాల‌లో ఆలీకి ఛాన్స్ ఇవ్వ‌డం లేదు. క‌ట్ చేస్తే ఇప్పుడు ఆలీ రాజ‌కీయాల‌కి గుడ్ బై చెప్పాడు కాబ‌ట్టి తిరిగి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మరింత ద‌గ్గ‌ర‌య్యేలా చూస్తున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. తాజాగా ఆలీ యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సుమ అడ్డ షోకు అతిథిగా విచ్చేశారు. ఈ సమయంలో సుమ అలీని కొన్ని ప్రశ్నలు అడిగింది.

పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నకి ఆలీ ఇచ్చిన స‌మాధానం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆన్ స్క్రీన్ లో ఈ హీరోల్లో ఎవరితో కాంబినేషన్ అంటే మీకు ఇష్టం అని సుమ అడ‌గ‌గా, అందుకు ఆప్ష‌న్స్ గా రవితేజ, పవన్ కళ్యాణ్ అని చెప్పింది. అలీ ఏమాత్రం ఆలోచించకుండా పవన్‌తో కాంబినేషన్ అంటే తనకు ఇష్టం అని తెలిపారు. ఆలీ స‌మాధానంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు జ‌నసైనికులు సైతం సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version