విధాత: నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐకానిక్ చిత్రం ‘శివ’ మరోసారి నవంబర్ 14న రీరిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ‘మన శివ సినిమా విడుదలై దాదాపు 36 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే ఐకానిక్ సినిమా. ఈ ఒక్క సినిమా తెలుగు సినిమా, ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేసింది. తెలుగు ఇండస్ట్రీ గురించి చెప్పాల్సి వస్తే.. ‘శివ’కు ముందు.. తర్వాత అని చెబుతారని అన్నారు. ఇప్పుడు ఈ సినిమా డాల్మీ అట్మాస్, 4కె రిజల్యూషన్ వంటి హై టెక్నాలజీ వెర్షన్‌లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మన క్లాసిక్ సినిమాను మిస్ కావొద్దు. మనం ఎంతగానో ప్రేమించే నాగార్జున కోసం అక్కినేని అభిమానులతోపాటు అందరూ ఈసారి థియేటర్లకి రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండి’ అని బన్నీ వీడియోలో చెప్పారు.
ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన నాగార్జునా.. ‘డియర్ అల్లు అర్జున్ రెండు లారీల థ్యాంక్స్ నీకు’ అని క్యాప్షన్ పెట్టారు.
రాంగోపాల్ దర్శకత్వంలో 1989లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై విడుదలైన ‘శివ’ సినిమా తెలుగు చిత్ర రంగంతో పాటు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మైలురాయిగా నిలిచింది. నాగార్జున కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. నేటీ తరం ప్రేక్షకుల కోసం ఈ సినిమాను కొత్త టెక్నికల్ హంగులతో 4కె వెర్షన్‌లో డాల్బీస్ ఆట్మాస్ సౌండ్ సిస్టమ్ తో నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Dear @alluarjun rendu lorryla thanks to you !!!💥💥💥#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025
