Amitabh Bachchan| బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇండియన్ సినిమా గర్వపడే ఎన్నో చిత్రాలు చేశారు. ఒకప్పుడు ఆయన సినిమాలలో నటించాలంటే హీరోయిన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసేవారు. ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా చూసేవారు. ఒక్క సినిమా అవకాశం వచ్చిందంటే వారి ఆనందం అంతా ఇంతా కాదు. బిగ్ బీ లాంటి స్టార్ హీరో పక్కన నటిచండం పట్ల కొందరు స్టార్స్ ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు. అయితే అమితాబచ్చన్ 80 ఏళ్ళు దాటినా కూడా కుర్రహీరోలకు పోటీ ఇస్తూ ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ఒక్క భాషకే పరిమితం కాకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో గెస్ట్ రోల్స్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు.
అయితే అమితాబ్ బచ్చన్ యంగ్ ఏజ్‌లో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మనం చూశాం. అయితే బ్లాక్ సినిమా 2005లో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రాన్ని సంజయ్ లీలా తెరకెక్కించాడు. ఇందులో అమితాబ్ సరసన రాణీ ముఖర్జీ కథానాయికగా నటించింది. ఆమె కళ్లు లేని ఆడపిల్లగా చిత్రంలో కనిపిస్తుంది. అయితే సినిమా చివరలో ముద్దు అడిగినప్పుడు అమితాబ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ వేరే లెవల్‌లో ఉంటాయి. చిత్రంలో ముద్దు ఎలా ఉంటుందో అని క్లైమాక్స్‌లో అమితాబ్‌ని అడిగి మరీ పెట్టుకుంటుంది హీరోయిన్ రాణీ ముఖర్జీ. అయితే ఈ సీన్ షూట్ చేసిన రోజు తాను రెండుసార్లు బ్రెష్ చేసుకున్నానని. అమితాబ్ దగ్గరకు వెళ్ళి ఇలా నటించడానికి తనకు ఎంతో భయం వేసిందని రాణీ ముఖర్జీ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
అమితాబ్ చివరిగా కల్కి చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించగా, అశ్వత్థామగా అమితాబ్ కనిపించి అలరించారు. ఈ వయస్సులో కూడా అమితాబ్ యాక్షన్ సన్నివేశాలలో చాలా అద్భుతంగా నటించి అందరిని అబ్బురపరిచారు. అమితాబ్ నట విశ్వరూపంపై ప్రశంసల వర్షం కురిసింది. ఇక ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లో సులువుగా చేరింది.