Site icon vidhaatha

Amy Jackson|అట్ట‌హాసంగా అమీ జాక్సన్ రెండో వివాహం.. కొడుకు స‌మ‌క్షంలో జ‌రిగిన పెళ్లి

Amy Jackson| బ్రిట‌న్ బ్యూటీ అమీ జాక్స‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తమిళ సినిమా మద్రాసీపట్నం అనే సినిమాతోభారతీయ సినిమారంగంలోకి ప్రవేశించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఏక్ దీవానా అనే హిందీ సినిమాలో నటించింది. అనంతరం రాంచరణ్‌తో కలిసి ఎవడు సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక ది విలన్ అనే సినిమా ద్వారా కన్నడ చిత్ర రంగంలోకి ప్రవేశించింది. అలా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ రంగాల్లో రాణించింది. అయితే అమీ జాక్స‌న్ ఇటీవ‌ల సినిమాల క‌న్నా ప్రేమ‌, పెళ్లి విష‌యాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. రీసెంట్‌గా ఈ భామ రెండో పెళ్లి చేసుకుంది. హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్ విక్ ను అమీ జాక్సన్ పెళ్లి చేసుకుంది. వీరు కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారు. వీరి మ్యారేజ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాలీవుడ్ యాక్టర్, ప్రముఖ నటి, స్వర్గీయ స్మితా పాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్‌తో కూడా కొన్నాళ్ల‌పాటు సహజీవనం చేసింది అమీ జాక్స‌న్. 2011 నుంచి 2012 వరకు వీరి రిలేష‌న్‌ సాగ‌గా, ఆ త‌ర్వాత వారి లివింగ్ రిలేషన్ బ్రేకప్ అయింది. ఇక ఆ త‌ర్వాత హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్ విక్ తో పరిచ‌యం ఏర్ప‌డ‌డం ఆ త‌ర్వాత అది ప్రేమగా మారింది. ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ జంట.. తాజాగా పెళ్లితో ఒక్కటైయ్యారు. కాగా.. అమీ జాక్సన్ , జార్జ్ పనియోటౌ అనే బిజినెస్ మెన్ తో కూడా రిలేష‌న్ షిప్ సాగించింది. వీరికి ఆండ్రూ అనే బాబు కూడా ఉన్నారు.

ఇక అమీ జాక్స‌న్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ‘ఎవడు’, ఐ, 2.ఓ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆమె నటించిన మిషన్ చాప్టర్ 1(తమిళ్), క్రాక్(హిందీ) ఈ సంవత్సరంలోనే విడుదలైయ్యాయి. అమీ జాక్స‌న్‌, ఎడ్ వెస్ట్ విక్ పెళ్లి ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ కాగా, ఆ జంట‌కి ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. అంతేకాదు అమీ జాక్స‌న్‌ని కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. ఇత‌నితో అయిన ఉంటావా లేదంటే కొన్నాళ్ల‌కి బ్రేక‌ప్ చెప్తావా అంటూ కౌంట‌ర్ వేస్తున్నారు.

Exit mobile version