Site icon vidhaatha

Anasuya | మరోసారి బోల్డ్ పాత్రలో అనసూయ.. ఈ మ‌ధ్య ఇలా త‌యారైందేంటి?

Anasuya:

జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపులారిటీ ద‌క్కించుకున్న అనసూయ ఈ మ‌ధ్య యాంక‌రింగ్‌కి గుడ్ బై చెప్పి సినిమాల‌కి ప‌రిమితమైంది. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోను సంద‌డి చేస్తుంది. అయితే అన‌సూయ అందాల అరాచ‌కం బాగా ఎక్కువైంది.

బుల్లితెర‌పై కొంత వ‌ర‌కు ప‌ర్వాలేద‌నిపించిన అన‌సూయ ఇప్పుడు సినిమాల‌లో మాత్రం బోల్డ్ లుక్‌లో క‌నిపిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో విచ్చ‌ల‌విడిగా అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది.

అన‌సూయ రీసెంట్‌గా విమానం అనే చిత్రంతో ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. ఇందులో బోల్డ్ పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది. వేశ్య‌గా అద‌ర‌హో అనిపించింది. ఇక ఇప్పుడు ‘వూల్ఫ్’ అనే సినిమాలో ఇంకో బోల్డ్ పాత్రలో కనిపించబోతోంది అని ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌తో అర్థం అవుతోంది.

ప్రభుదేవా , రాయ్ లక్ష్మీ, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఈ సినిమాను సందేశ్ నాగరాజు, సందేశ్ ఎన్ నిర్మించారు. వినూ వెంకటేష్ చిత్రానికి దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా విడుద‌లైన 69 సెక‌న్ల టీజ‌ర్ లో రేపు నేను ఇంటికి వెళ్లాలి. రేపు మన లవ్ గురించి ఇంట్లో చెప్పాలి.. ఇక్కడికి రా మాట్లాడుకుందాం అనాలి.. అంటూ మోడ్రన్ లుక్స్, వేరే గెటప్స్‌తో వింత మనుషుల్ని చూపించారు.

అయితే టీజ‌ర్ ని చూస్తుంటే అన‌సూయ ఈ మూవీలో స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నదని అర్ధ‌మ‌వుతుంది. తెలుగు ప్రేక్షకుల్లో అనసూయకి ఫుల్ క్రేజ్ ఉంది కాబ‌ట్టి ఆమె పాత్ర‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించ‌నున్నార‌ని తెలుస్తుంది. అన‌సూయ‌ గెటప్, ఆమె ఎలాంటి పాత్ర చేస్తోంది అనే విషయం మీద ప్రేక్షకులకి అమిత‌మైన ఆస‌క్తి నెల‌కొంది.

టీజ‌ర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది అని చెప్పాలి.. అమ్రిష్ సంగీత దర్శకుడిగా పని చేయ‌గా, ఆయ‌న ఇచ్చిన సంగీతంకి మంచి మార్కులే ప‌డ్డాయి. అయితే అన‌సూయ ఇటీవ‌ల ఇంత బోల్డ్‌గా ద‌ర్శ‌న‌మిస్తూ ప్రేక్ష‌కుల‌తో పాటు అభిమానుల‌ని కూడా సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గురి చేస్తుంది.

Exit mobile version