Anasuya| లైవ్‌లో జాకెట్ విప్పిన అన‌సూయ‌పై ట్రోలింగ్‌.. వాటికి ఎలాంటి స‌మాధానం ఇచ్చిందంటే..!

Anasuya| యాంక‌ర్‌గా బుల్లితెర‌కి పరిచ‌య‌మై ఆ త‌ర్వాత న‌టిగా స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ఇప్పుడు అన‌సూయ సోష‌ల్ మీడియాలోను తెగ ర‌చ్చ చేస్తూ ఉంటుంది. '

  • Publish Date - June 24, 2024 / 10:21 AM IST

Anasuya| యాంక‌ర్‌గా బుల్లితెర‌కి పరిచ‌య‌మై ఆ త‌ర్వాత న‌టిగా స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ఇప్పుడు అన‌సూయ సోష‌ల్ మీడియాలోను తెగ ర‌చ్చ చేస్తూ ఉంటుంది. ‘జబర్ధస్త్’ షోతో అనసూయ భరద్వాజ్ ఇండ‌స్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ షో త‌ర్వాత ప‌లు టీవీ షోల‌లో కూడా సంద‌డి చేసింది. బుల్లితెర‌పై చాన్నాళ్ల‌పాటు త‌న హ‌వాని చూపించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం ఊహించ‌ని విధంగా స్మాల్ స్క్రీన్‌కి దూర‌మై వెండితెర‌పైనే సంద‌డి చేస్తుంది. గత ఏడాది ‘మైఖేల్’తో ఆడియెన్స్‌ను అలరించింది. అలాగే, వరుసగా ‘రంగమార్తాండ’, ‘విమానం’, ‘పెద కాపు 1’, ‘ప్రేమ విమానం’ వంటి మూవీలలో అదిరిపోయే పాత్రలు చేసింది. అన‌సూయకి మంచి అవ‌కాశాలు వ‌స్తున్నా కూడా ఆ పాత్ర‌ల‌తో ఇటీవ‌ల పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోతుంది.

అన‌సూయ చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప 2’ వంటి భారీ ప్రాజెక్టుల‌తో పాటు తమిళ చిత్రం ‘ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉంది. ఈ సినిమాలపై భారీ అంచ‌నాలు పెట్టుకుంది. అయితే కొన్నాళ్లుగా బుల్లితెర‌కి దూరంగా ఉన్న అన‌సూయ ఇప్పుడు తిరిగి స్మాల్ స్క్రీన్‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్’ పేరుతో స్టార్ మాలో ఓ గేమ్ షో జూన్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానుండ‌గా, ఇది ప్ర‌తి శ‌ని, ఆదివారాల‌లో ప్ర‌సారం కానుంది. శ్రీముఖి హోస్ట్‌గా ప్రారంభం కానున్న ఈ షోలో అమ్మాయిలు, అబ్బాయిలు రెండు టీమ్స్‌గా విడిపోతారు. ఖిలాడీ గర్ల్స్ టీమ్‌కు అనసూయ, కిర్రాక్స్ బాయ్స్‌కు శేఖర్ మాస్టర్ మెంటర్లుగా ఉన్నారు.

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో అన‌సూయ జాకెట్ విప్పేస్తుంది. దీనికి ఓ నెటిజ‌న్.. ఇది నిజంగా నాన్ సెన్స్.. ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది అని పోస్ట్ పెట్టాడు. అంతేకాదు దాని కి వాంతి చేసుకుంటున్న ఎమోజీలు కూడా యాడ్ చేశాడు. దీనికి అన‌సూయ స్పందిస్తూ.. మీరు పెట్టిన ఎమోజిలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే.. ఎందుకు మీరు ఇలాంటి రోగంతో ఎందుకు బాధ‌ప‌డుతున్నారా అని అనిపిస్తుంద‌ని కామెంట్ చేసింది. ప్ర‌స్తుతం అన‌సూయ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి

Latest News