Site icon vidhaatha

Anausya| ఏంటి.. అన‌సూయను త‌న భ‌ర్త నుండి విడ‌దీయాల‌ని ఈమె చూసిందా?

Anausya| అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి తెలుగు రాష్ట్ ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ముందు న్యూస్ రీడ‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టి ఆ త‌ర్వాత యాంక‌ర్‌గా మారి ఇప్పుడు న‌టిగా సెటిల్ అయింది. అయితే యాంకర్ గా చేసిన తర్వాతనే అన‌సూయ‌కి మంచి క్రేజ్ వ‌చ్చింది. ఆ పాపులారిటీతోనే ఆమెకి సినిమాల్లో అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి. “రంగస్థలం” లో రంగమ్మత్త పాత్ర నిలిచిపోయింది.ఈ సినిమా త‌ర్వాత అన‌సూయ‌కి చాలా సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమాలో దాక్షాయ‌ణి పాత్ర‌తో ఎంత‌గానో మెప్పించింది. పార్ట్ 2 లో కూడ అన‌సూయ దాక్షాయ‌ణిగా అల‌రించ‌నుంద‌ని అంటున్నారు. సెకండ్ పార్ట్‌లోనే ఆమె పాత్ర‌కి ఎక్కువ స్కోప్ ఉండ‌నుంద‌ని అంటున్నారు.

ఇక అన‌సూయ ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. ఆమె చ‌దువుకునే రోజులలో ఎన్సీసీసీ క్యాంప్‌లో సుశాంక్ భరద్వాజ్ అనే వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డింది. వీరి ప్రేమాయణం చాలా రోజుల పాటు సాగింది. పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో త‌ల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌లేదు. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని అన‌సూయ అంటూ అందుకు సుశాంక్ ఒప్పుకోలేద‌ట‌. పేరెంట్స్ అంగీకారం తెలిపాకే పెళ్లి చేసుకుందాము అని ఎట్ట‌కేల‌కి త‌న తండ్రి మ‌న‌సు క‌రిగించి సుశాంక్‌ని వివాహమాడింది అన‌సూయ‌. ఈ జంటకి ఇద్దరు పిల్ల‌లు ఉన్నారు.

ఇక అన‌సూయ ఇప్పుడు బుల్లితెర‌పై కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షోలో అన‌సూయ‌కి నిర్వాహ‌కులు బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు . అప్ప‌ట్లో ఎన్సీసీ ట్రైనింగ్‌ ఆఫీసర్ గా ఉన్న సరోజ్ బాలాని తీసుకు వ‌చ్చారు. ఆమెను చూసిన అనసూయ పరుగున వెళ్లి హగ్ చేసుకుంది. ఇక అప్పుడు క్యాంప్‌లో జ‌రిగిన కొన్ని విష‌యాల‌ని వారు గుర్తు చేసుకున్నారు. స‌రోజా మాట్లాడుతూ.. అప్ప‌ట్లో అబ్బాయిల కంట పడకుండా అన‌సూయని దాచేసేదాన్ని, ఎవరు లైన్ వేస్తారో అని ట్రైనింగ్ ఆఫీసర్ అన్నారు. యాంకర్ శ్రీముఖి మధ్యలో కల్పించుకుని ‘మరి ఎన్సీసీ క్యాంపు లోనే సుశాంక్ ని అనసూయ ప్రేమించారట కదా… అని అడిగింది. అనసూయ-సుశాంక్ లను విడదీయడానికి నేను అనేక ప్రయత్నాలు చేశానని ఎన్సీసీ ఆఫీసర్ అన్నారు. మేడం వలన ఆ రోజుల్లో నేను సుశాంక్ ఒక్క ఫోటో కూడా దిగ‌లేక‌పోయానంటూ ఆస‌క్తిక‌ర కామెంట్ చేసింది అన‌సూయ‌.

Exit mobile version