Annapoorna| కోరిక తీర్చ‌మ‌ని డోర్స్ కొట్టేవారు.. ఎయిడ్స్ రావ‌డంతో భ‌య‌ప‌డ్డారంటూ అన్న‌పూర్ణ కామెంట్స్

Annapoorna| ప్ర‌స్తుతం టాలీవుడ్ సీనియ‌ర్ న‌టీమణుల్లో అన్న‌పూర్ణ ఒకరు. ఆమె ఎంతో మంది స్టార్ హీరోల‌తో కూడా క‌లిసి ప‌ని చేసింది. పాత్ర‌లో ఇట్టే ఇమిడిపోయి మంచి వినోదం పంచే అన్న‌పూర్ణ‌మ్మ జీవితంలో ప‌లు విషాదాలు కూడా ఉన్నాయి. ఆమె కూతురు అనూహ్యంగా ఆత్మ‌హ‌త్య చేసుకొని చ‌నిపోయింది

  • Publish Date - June 28, 2024 / 08:44 AM IST

Annapoorna| ప్ర‌స్తుతం టాలీవుడ్ సీనియ‌ర్ న‌టీమణుల్లో అన్న‌పూర్ణ ఒకరు. ఆమె ఎంతో మంది స్టార్ హీరోల‌తో కూడా క‌లిసి ప‌ని చేసింది. పాత్ర‌లో ఇట్టే ఇమిడిపోయి మంచి వినోదం పంచే అన్న‌పూర్ణ‌మ్మ జీవితంలో ప‌లు విషాదాలు కూడా ఉన్నాయి. ఆమె కూతురు అనూహ్యంగా ఆత్మ‌హ‌త్య చేసుకొని చ‌నిపోయింది. ఆ స‌మ‌యంలో చాలా డిప్రెష‌న్‌కి లోనైంది. ఇక ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి తేరుకుంటున్న అన్న‌పూర్ణ సినిమా, టీవీ షోస్ చేస్తూ బిజీగా మారింది. ఇక ప‌లు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డిస్తుంది. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె కీలక ఆరోపణలు చేశారు. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేదని ఆమె చెప్పుకు వ‌చ్చారు.

క్యాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో మాత్ర‌మే లేద‌ని, మ‌హిళ‌లు ప‌ని చేసే ప్ర‌తి చోట ఉంద‌ని ఆమె పేర్కొంది. త‌ప్పు అనేది కేవ‌లం ఒకరిపైనే ఉండ‌ద‌ని, ఎదుటివారిని బ‌ట్టి ఇద్దరి మ‌ధ్య ఉంటుంద‌ని ఆమె తెలియ‌జేసింది. కాస్టింగ్ కౌచ్ అంత‌గా ఉండ‌గా, కుటుంబ పరువు, మర్యాద కోసం మహిళలు తెలివిగా తప్పించుకుంటున్నారు. అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించేవాళ్లకి ఈ లైంగిక వేధింపులు త‌ప్ప‌వంటూ అన్నపూర్ణ‌మ్మ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. మేము సినిమా షూటింగ్స్ కోసమని ఎక్కడెక్కడికో తిరిగేవాళ్ళం. అర్థరాత్రి కూడా కక్కుర్తి గాళ్ళు మా రూమ్ తలుపులు కొట్టేవారు. ఎయిడ్స్ వచ్చాక ఈ లైంగిక వేధింపులు తగ్గాయి అని పేర్కొంది. ఎవ‌రికి ఎయిడ్స్ ఉందో అనే భ‌యంతో లైంగికంగా వేధించ‌డం మానేశారు. ఎయిడ్స్ వ‌చ్చి మంచి ప‌ని అయింది. ఒక్కోసారి చెడు వ‌ల‌న కూడా మంచి జ‌రుగుతుందంటే ఇదేనేమో అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది అన్న‌పూర్ణ‌మ్మ‌.

త‌న‌ని అప్ప‌ట్లో ఆఫర్ ఇస్తే మాకేంటి అనేవారు అట‌. అందుకే నేను 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని, 25 ఏళ్లకు అమ్మ పాత్రలు చేయడం స్టార్ట్ చేశాను. అయితే మదర్ రోల్స్ చేయడం మొదలెట్టాక లైంగిక వేధింపులు తగ్గాయి అని కామెంట్ చేసింది అన్న‌పూర్ణ‌. ఈమె శోభ‌న్ బాబు, కృష్ణ వంటి సీనియర్ హీరోల‌కి సైతం త‌ల్లిగా న‌టించి మెప్పించింది.

Latest News