Anushka Shetty | అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నది. టాలీవుడ్‌లో అనుష్క (Anushka Shetty) ఎంతో క్రేజ్ ఉన్నది. అభిమానులంతా ఆమెను ముద్దుగా టాలీవుడ్ జేజమ్మగా పిలుచుకుంటారు. కొద్దిరోజులుగా స్విటీ సినిమాలకు దూరంగా ఉన్నది. బాహుబలి సిరీస్ (Bahubali) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్నది. అయితే, ఆ తర్వాత తర్వాత అనుష్క క్రేజ్ మరింత పెరుగుతుందని.. సినిమాల్లో ఫుల్ బిజీగా అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడింది.
భాగమతి, నిశ్శబ్దం సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చినా పెద్దగా సక్సెస్ రాలేదు. నిశ్శబ్దం మూవీతో తర్వాత చాలారోజులు గ్యాప్ తీసుకొని మిస్సెస్ పొలిశెట్టి.. మిస్టర్ శెట్టి సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా పెద్దగా కలిసిరాలేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ జేజమ్మ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలోనే తొలిసారిగా మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. కథనార్ మూవీలో నటిస్తున్నది. చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి రాబోతున్నది. దాంతో పాటు క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలోనూ బైలింగ్యువల్ చిత్రంలోనూ నటించింది. ఈ మూవీ షూటింగ్ సైతం పూర్తయ్యిందని.. త్వరలోనే విడుదలకానున్నట్లు టాక్.
ఒకేసారి అనుష్క బైక్ బ్యాక్ మూవీలతో అభిమానులను పలుకరించబోతున్నది. ఆయా సినిమాల ప్రమోషన్స్ త్వరలో మొదలుకానుండగా.. స్వీటీ సైతం పాల్గొని పలుకరించబోతుందట. చాలారోజులు విరామం అనంతరం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో అనుష్క లుక్‌పై పెద్ద చర్చ జరుగుతున్నది. గతంలో ఓ మూవీ కోసం అనుష్క బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బరువు తగ్గించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పొలిశెట్టి సినిమా సమయానికి కొంత వరకు బరువు తగ్గింది. కథనార్ మూవీ ప్రకటన సమయంలో అనుష్క లుక్ అందరనీ ఆకట్టుకున్నది. గతంలో మాదిరిగా ఫర్‌ఫెక్ట్ ఫిజిక్‌తో కనిపించారు. త్వరలో రానున్న సినిమాల్లోనే అలాగే ఉంటుందని భావిస్తూ.. స్వీటీ సినిమాలకు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.