Anushka Shetty| అందాల ముద్దుగుమ్మ అనుష్క గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడిని ముద్దుగా స్వీటీ అని పిలుస్తుంటారు. అనుష్క వివాదాలకి దూరంగా ఉంటూ సినిమాలలో అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకుంటుంది. బాహుబలి సినిమాతో అనుష్క రేంజ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లింది. బాహుబలి తర్వాత కొత్తగా ఈ అమ్మడు ప్రయోగం చేసింది. సైజ్ జీరో కోసం అనుష్క భారీ బరువు పెరగగా ,ఆ బరువు తగ్గించుకునేందుకు ఇప్పటికీ నానా తంటాలు పడుతుంది. సినిమాల్లో మాదిరిగానే రియల్ లైఫ్‌లోనూ అనుష్క ఆ సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంది. ఆ బరువు వల్లనో ఏమో కాని సినిమాల సంఖ్య కూడా అనసూయ తగ్గించేసింది. అయితే ఈ మధ్య కాస్త బరువు తగ్గడంతో అనుష్క తిరిగి సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.
మలయాళంలో ఓ సినిమా చేస్తున్న అనుష్క తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఘాటి అనే మూవీ చేస్తుంది. ఈ రెండు చిత్రాలు కూడా లేడి ఓరియెంటెడ్ మూవీస్ కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే అనుష్కకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆమెని వింత జబ్బు వేధిస్తుందని అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. తనకు లాఫింగ్(నవ్వు) సమస్య ఉందని చెప్పింది. నవ్వడం ప్రారంభిస్తే ఆపడానికి పది పదిహేను నిమిషాలు అలానే నవ్వుతుందట. ఏదైన నవ్వు తెప్పించే సన్నివేశాలు జరిగినప్పుడు, కామెడీ సీన్స్ చూసినప్పుడు అనుష్క అదే పనిగా నవ్వుతూ ఉంటుందట.
తను ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా అది కుదరదట. ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే పదిహేను, ఇరవై నిమిషాలపాటు కంటిన్యూగా నవ్వుతూనే ఉంటానని అనుష్క చెప్పుకొచ్చింది. అయిత ఆ సమస్య వలన చాలా సందర్భాలలో షూటింగ్‌కి అంతరాయం కూడా కలిగిందని అనుష్క పేర్కొంది. అయితే అతిగా నవ్విన అది పలు అనార్ధాలకి దారి తీస్తుంది. మెదడు గాయం లేదా అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) వంటి అంతర్లీన నరాల వ్యాధి ఫలితంగా కలిగే రుగ్మత వలన అలా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఉన్న వారు అతిగా నవ్వడం, లేదా ఏడవడం వంటివి చేస్తుంటారు. మరి ఆ సమస్య నుండి అనుష్క ఎలా బయటపడుతుందో చూడాలి.