Bala Krishna| నంద‌మూరి బాల‌య్య బ‌ర్త్ డే.. అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన బోయ‌పాటి

Bala Krishna| విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు బాల‌య్య‌. 1974లో తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ''తాతమ్మ కల '' సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన బాల‌య్య కెరీర్‌లో ఎన్నో విభిన్న‌మైన చిత్రాలు చేశారు. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాలలో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ని మెప్పించారు. న‌ట‌సింహ‌గా అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ము

  • Publish Date - June 10, 2024 / 10:36 AM IST

Bala Krishna| విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు బాల‌య్య‌. 1974లో తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ”తాతమ్మ కల ” సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన బాల‌య్య కెరీర్‌లో ఎన్నో విభిన్న‌మైన చిత్రాలు చేశారు. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాలలో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ని మెప్పించారు. న‌ట‌సింహ‌గా అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న బాల‌య్య ఈ రోజు త‌న బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్నారు.ఈ క్రమంలో ఆయ‌న సినిమాల‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ని ఆనందింప‌జేస్తున్నారు. తాజాగా బాల‌కృష్ణ‌-బోయ‌పాటి మూవీకి సంబంధించిన అప్‌డేట్ వ‌చ్చింది.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చిత్రం రూపొందుతున్న‌ట్టు తెలియ‌జేశారు. బాల‌య్య‌-బోయపాటి కాంబోలో నాలుగో సినిమా రాబోతున్న‌ట్టు BB4 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో బాలయ్య కూతురు తేజస్విని నందమూరి కూడా నిర్మాతగా భాగమవడం గమనార్హం. తేజస్విని గతంలో బాలయ్య అన్ స్టాపబుల్ కి కూడా పనిచేసింది. ఇక ఇదిలా ఉంటే హిందూపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా హ్యాట్రిక్ కొట్టిన త‌ర‌వాత బాల‌య్య జ‌రుపుకుంటున్న తొలి పుట్టిన రోజు ఇది. ఈ క్ర‌మంలో అభిమానులు తెగ హ‌డావిడి చేస్తున్నారు. ‘కాబోయే మంత్రి బాల‌య్య‌’ అనే ఆనందంతో ఈసారి పుట్టిన రోజు పండ‌గ చేసుకోబోతున్నారు ఫ్యాన్స్‌.

బాలయ్య మూడో సారి హిందూపురం నుంచి గెలవడంతో ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలను హిందూపురంలోనే తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల మధ్య జరుపుకుంటున్నారు.ఈ రోజు ఉదయం బాలకృష్ణ హిందూపురం సుగూరు అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి పార్టీ కార్యకర్తలు, నాయకులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలపడానికి భారీ ఎత్తున వచ్చారు. ఇక ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల‌లో బాలయ్య జ‌న్మ‌దిన వేడుకలు ఓ రేంజ్‌లో నిర్వ‌హిస్తున్నారు ఫ్యాన్స్.

Latest News