Site icon vidhaatha

Bala Krishna| యంగ్ హీరోల‌తో బాల‌య్య ఫ్రెండ్షిప్ చేయ‌డం వెన‌క కార‌ణం ఇదా?

Bala Krishna| ప్ర‌స్తుతం ఉన్న టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో బాల‌య్య రూట్ స‌ప‌రేటు. ఆయ‌న ఏం చేసిన అది సెన్సేష‌న్ అవుతుంటుంది. సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటున్న బాల‌య్య ఆ మ‌ధ్య అన్‌స్టాప‌బుల్ అనే షోతో హోస్ట్‌గా కూడా అవ‌తార‌మెత్తి అద‌ర‌గొట్టాడు. బాల‌య్య గ‌త కొద్ది రోజులుగా ఎన్నిక‌ల ప్ర‌చారాల‌తో బిజీగా ఉండ‌గా, ఇప్పుడు తిరిగి సినిమాల‌పై దృష్టి పెట్టాడు. అయితే బాల‌య్య‌కి సంబంధించిన ఓ విష‌యం ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఆయ‌న సీనియర్లతో ఫ్రెండ్షిప్ చేయకుండా రూటు మార్చి యంగ్ హీరోలు అయిన సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడవి శేషు లాంటి కుర్ర హీరోలతో ఫ్రెండ్షిప్ చేస్తుండ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవ‌ల విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాల‌య్య చీఫ్ గెస్ట్‌గా పాల్గొని ఎంత సంద‌డి చేశాడో మ‌నం చూశాం. అక్క‌డ ఆయ‌న మాట్లాడిన మాట‌లు చేసిన చేష్ట‌లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఈవెంట్‌లో మందు తాగాడ‌ని, అంజ‌లిని అలా ఎలా నెట్టేస్తాడంటూ బాల‌య్య‌పై చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తారు. అయితే ఈవెంట్ లో బాల‌య్య‌.. యంగ్ హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అంటే ఇష్టమని వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం అంటే తనకు చాలా సరదా అని కూడా చెప్పాడు. అయితే బాలయ్య బాబు ఏజ్ పెరుగుతున్నా కూడా ఆయన మైండ్ సెట్ అనేది యంగ్ జనరేషన్ కి తగ్గట్టుగా ఉంద‌ని తెలియ‌జేయ‌డానికే యువ హీరోల‌తో స్నేహం చేస్తున్నాడంటూ కొంద‌రి మాట‌

నిజానికి బాలయ్య ఇటీవ‌ల మంచి మంచి హిట్స్ అందుకున్నాడు. వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా బాల‌కృష్ణ త‌న సినిమాల‌లో కొత్తదనం చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు.ఎంతో స్టార్‌డం ఉన్న బాల‌య్య యువ హీరోల‌తో అంత జోవియ‌ల్‌గా ఉండ‌డం అనేది నిజంగా గొప్ప విష‌య‌మే. ఇక ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Exit mobile version