Site icon vidhaatha

Bala Krishna|అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4లో ప్ర‌త్యేక అతిథులు.. ఈ సారి ర‌చ్చ లేప‌డం ఖాయం..!

Bala Krishna| గాడ్ ఆఫ్ మాసెస్, సీనియర్ హీరో బాలకృష్ణ స‌రికొత్త ప్ర‌యోగం అన్‌స్టాప‌బుల్ ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ‘అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే’ టాక్ షో ఆహా ఓటీటీలో వచ్చిన తొలి రెండు సీజన్లు అద్భుతమైన సక్సెస్ అయ్యాయి. టాలీవుడ్ టాప్ స్టార్లు పాల్గొన్న ఈ షో భారీ వ్యూస్ దక్కించుకుంది. మూడో సీజన్ లిమిటెడ్ ఎడిషన్‍గానే వచ్చింది. అయితే, త్వరలో పూర్తిస్థాయిలో అన్‍స్టాపబుల్ సీజన్ 4 వచ్చేందుకు రెడీ కాగా, ఇది ఇప్పుడు మొద‌లు అవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 12వ తేదీన ఫ‌స్ట్ ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని ఆహా భావిస్తోంది. అందుకు తగ్గట్టే ఇప్పటికే ఏర్పాట్లు చేసిన‌ట్టు స‌మాచారం.

ఇక ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌బోయే వారు ఎవ‌రు అనే దానిపై జోరుగా చర్చ‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సీజన్ ఫోర్ కార్యక్రమంలో కింగ్ నాగార్జున మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్టులుగా రాబోతున్నారని తెలుస్తోంది. షోలో బాలకృష్ణ వీరందరిని ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు, వీరి నుంచి ఎలాంటి సమాధానాలు రాబడుతున్నారని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు..మొదటి సీజన్ లో కేవలం సినీ సెలబ్రిటీలు వచ్చినప్పటికీ, రెండవ సీజన్లో చంద్రబాబు నాయుడు లోకేష్, కిరణ్ కుమార్ రెడ్డి వంటి పొలిటీషియన్స్ ని కూడా ఆహ్వానించి షోపై మ‌రింత ఆస‌క్తి పెంచారు.

నాలుగో సీజ‌న్‌లో మాజీ మంత్రి కేటీఆర్, రామ్ చరణ్, వెంకటేష్, వంటి వారు కూడా హాజరు కానున్నారని అంటున్నారు. అంతేకాదు ‘దేవర’ ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కూడా హాజరయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. మూడు ఎపిసోడ్లకు సంబంధించి మొత్తం 22 ఎపిసోడ్లు విడుదల కాగా, అన్ని ఎపిసోడ్లు పెద్ద హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు నాలుగో సీజన్ కూడా మ‌రింత హిట్ అవుతుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Exit mobile version