Bhanu Priya| భానుప్రియ గురించి ఈ నాటి తరం ప్రేక్షకులకి అంతగా తెలియకపోవచ్చేమో కాని 1980, 90 దశకంలో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది భానుప్రియ. స్వర్ణకమలం, సితార, అన్వేషణ, ఖైదీ నంబర్ 786తో పాటు తెలుగులో పలు సినిమాలు చేసి మెప్పించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. అయితే ఆమె సినిమాలు చేస్తున్న సమయంలో సుహాసిని, రమ్యకృష్ణ, రాధా, రాధిక, విజయశాంతి, ఖుష్బూ లాంటి హీరోయిన్లు భానుప్రియకి పోటీగా వచ్చిన ఈమె మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అందరి మన్ననలు పొందింది.
భానుప్రియ తెలుగు స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, సుమన్ లాంటి స్టార్స్ తో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందరు హీరోలతో కూడా ఆమెకి ప్రత్యేక అనుబంధం ఉండేది. అయితే 1980లలో కలిసి పని చేసిన హీరోలు .. హీరోయిన్స్ అప్పుడప్పుడు ’80s రీ యూనియన్’ గ్రూప్ పెట్టుకొని సరదాగా కలుసుకుంటూ ఉంటారు. అందుకు సంబంధించి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు భానుప్రియ వారితో కనిపించింది లేదు. దీని గురించి తాజాగా భాను చందర్ క్లారిటీ ఇచ్చాడు.
ఇలా అందరం కలుసుకోవాలనే ఒక ఆలోచన పూర్తిగా సుహాసిని .. లిజీకి వచ్చింది. వాళ్లకి ఆ ఆలోచన రాగానే మొదట నాకు కాల్ చేయడంతో వెంటనే దానిని ఆచరణలో పెట్టేశాం. అయితే భానుప్రియ ఎందుకు రావడం లేదనే దానిపై భాను చందర్ మాట్లాడుతూ.. భానుప్రియకి ఆమె ఫ్యామిలిలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయట. కుటుంబసభ్యులతో ఆమెకి సమస్యలు ఉన్నాయి. అంతే కాదు ఆ మధ్య భానుప్రియ అనేక వివాదాలతో వార్తలలోకి ఎక్కడం మనం చూశాం. తన ఇంట్లో పనిచేసే పనిమనిషితో సైతం ఒక సందర్భంలో భానుప్రియ వివాదంలో నిలిచింది. ఇలాంటి కారణాల వలనే భానుప్రియ గెట్ టు గెదర్ లాంటి మీటింగ్స్ కి హాజరు కావడం లేదని భానుచందర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.