Bigg Boss| ఇంద్ర‌భ‌వనాన్ని త‌ల‌పిస్తున్న బిగ్ బాస్ హౌజ్.. చూస్తుంటే మ‌తి పోతుంది..!

Bigg Boss| బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని షో బిగ్ బాస్. ఈ షో అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంటుంది. తెలుగులో ఏడు సీజ‌న్స్ పూర్తి చేసుకోగా, ఇప్పుడు ఎనిమిదో సీజ‌న్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హిందీలో ఇప్పటికే బిగ్ బాస్ 17 సీజన్ పూర్తి చేసు

  • Publish Date - June 21, 2024 / 06:20 PM IST

Bigg Boss| బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని షో బిగ్ బాస్. ఈ షో అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంటుంది. తెలుగులో ఏడు సీజ‌న్స్ పూర్తి చేసుకోగా, ఇప్పుడు ఎనిమిదో సీజ‌న్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హిందీలో ఇప్పటికే బిగ్ బాస్ 17 సీజన్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ షోని ప్ర‌సారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే హౌజ్‌కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, మేక‌ర్స్ కొత్త హౌజ్ వీడియోని విడుద‌ల చేశారు.

కొత్త బిగ్ బాస్ హౌస్ చాలా భిన్నంగా ఉంది. ప్రతి ప్రాంతాన్ని మేకర్స్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక వీడియోలో భారీ స్విమ్మింగ్ పూల్ ఉన్న గార్డెన్ గ్లింప్స్ తో ప్రారంభమవుతుంది. అలానే జిమ్ ప్రాంతం, ఎరుపు, బంగారంతో చేసిన లివింగ్ రూమ్ విజువల్స్ , వంటగది,, బెడ్‌రూమ్ ఇలా ప్ర‌తి ఒక్క‌టి కూడా ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. చూడ‌డానికి ఈ ఇల్లు ఇంద్ర‌భ‌వ‌నంలా ఉంది. ఇక వీడియోని షేర్ చేసిన మేక‌ర్స్ ఇల్లు అలంకరించబడింది. మీరు సిద్ధంగా ఉన్నారా అనే క్యాప్షన్ ని జోడించారు. శుక్రవారం నుంచి బిగ్ బాస్ OTT 3. జియో సినిమా ప్రీమియంలో ప్రత్యేకంగా ప్రసారం కానుంది.

ఇక రీసెంట్‌గా షోకి సంబంధించిన టీజర్‌ని షేర్ చేయ‌గా, ఇందులో అనీల్ క‌పూర్ వేదిక‌పై డ్యాన్స్ చేసి సంద‌డి చేశారు. ఇప్పుడు సీజ‌న్ 3కి అనీల్ క‌పూర్ హోస్ట్‌గా ఉండ‌బోతున్నాడు. ఓటీటీ తొలి సీజ‌న్‌కి ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఈ సీజన్‌లో దివ్య అగర్వాల్ విజేతగా నిలిచింది. రెండవ ఎడిషన్‌ను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయగా, ఆ సీజ‌న్‌లో ఎల్విష్ యాదవ్ ఆ సీజన్‌ను గెలుచుకున్నాడు. ఇక బిగ్ బాస్ OTT 3 టీవీ రియాలిటీ షోకి హోస్ట్‌గా అనిల్ కపూర్ అరంగేట్రం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సీజ‌న్ ఎంత‌గా అల‌రిస్తుందో చూడాలి.

Latest News