Site icon vidhaatha

Bigg Boss8|గౌత‌మ్‌కి బుర్ర లేద‌న్న గంగ‌వ్వ‌.. ఓడిన అద‌ర‌గొట్టిన టేస్టీ తేజ‌

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. ఒక‌వైపు వినోదం, మరోవైపు రిస్కీ టాస్క్‌లు, గొడ‌వ‌లు ఇలా బిగ్ బాస్ హౌజ్ హోరెత్తిపోతుంది. అయితే తాజా ఎపిసోడ్‌లో అవినాష్‌, రోహిణి తెగ న‌వ్వించారు చిన్న పిల్ల‌లుగా మారి వీరు చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. అవినాష్ లేడీ కంటెస్టెంట్స్ దగ్గరకు వెళ్లి ముద్దు కావలి, ఎత్తుకోవాలి అంటూ హడావిడి చేశాడు. ప్రేరణ, నయని, యష్మీ అవినాష్ ను ఎత్తుకున్నారు. మొత్తానికి మ‌నోడు మాత్రం నానా ర‌చ్చ చేశాడు. ఇక బిగ్ బాస్ తాడో పేడో అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో టీం గ్రీన్ తేజ, టీం ఎల్లో నుంచి రోహిణి, టీం బ్లూ నుంచి నిఖిల్, టీం రెడ్ నుంచి గౌతమ్ పాల్గొన్నారు.

టాస్క్ లో భాగంగా కింద పడేసిన తాడు ముక్కలని ఏరుకుని పెద్ద తాడుగా చేసుకోవాలి. మధ్యలో ఉంచిన బాక్స్ ని ఆ తాడు సాయంతోలాగాల్సి ఉంటుంది. ఎవరు ముందుగా ఆ బాక్స్ ను తమ వైపు లాక్కుంటారో వాళ్లే విన్న‌ర్స్ అని బిగ్ బాస్ చెప్పాడు. గెలిచిన వాళ్లు వాళ్ల టీమ్ లీడర్‌కి రెండు డైస్ రోల్ చేసే అవకాశంతో పాటు రెండు ఎల్లో కార్డ్స్ లభిస్తాయి అని చెప్పాడు. రోహిణి, నిఖిల్‌, గౌత‌మ్ పోటీ ప‌డ‌గా ఈ పోటీలో నిఖిల్ గెలిచాడు. బిగ్ బాస్ షరతుల ప్రకారం టీం రెడ్ నుంచి ఒకరు తప్పుకోవాల్సి ఉండ‌గా, య‌ష్మీ, ప్రేర‌ణ‌లు అస్స‌లు త‌ప్పుకోలేదు. దీంతో గౌత‌మ్ చేసేదేం లేక త‌ప్పుకున్నాడు. ఇది గమనించిన గంగవ్వ.. విష్ణుప్రియతో గౌతమ్ కి బుర్రలేదు.. యాష్మి, ప్రేరణతో గట్టిగా మాట్లాడాల్సింది అని చెప్పుకొచ్చింది.

మెగా చీఫ్ కంటెండర్లుగా ఎంపికైన వారు హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. వీరికి తిరుగుతూనే ఉండు.. గెలిచే వరకూ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. షిప్ బ్యాగ్‌ను భుజాలపై మోస్తూ మీ బ్యాగ్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది.. ఎవరి బ్యాగ్స్ లో బాల్స్ తక్కువ ఉంటాయో వారు ఈ రేస్ నుంచి తప్పుకుంటారు అని చెప్పాడు బిగ్ బాస్. ముందుగా నిఖిల్, ప్రేరణ.. హరితేజని టార్గెట్ చేశారు. హరితేజ బ్యాగ్ ఖాళీ అయింది. ప్రేరణ.. టేస్టీ తేజని టార్గెట్ చేసింది. వీళ్లిద్దరి మధ్య బాగా ఫిజికల్ అటాక్ జరిగింది. తేజ కొన్నిసార్లు కింద కూడా పడిపోయాడు. ఒకవైపు నుంచి ప్రేరణ.. మరోవైపు నుంచి నిఖిల్ తేజని టార్గెట్ చేశారు. దాంతో తేజ బ్యాగ్ కూడా ఖాళీ అయింది. అయితే త‌న‌ని టార్గెట్ చేసి మెగా చీఫ్ ఛాన్స్ రాకుండా చేసినందుకు తేజ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. తేజ ఓడిపోయినా కూడా అతను ఆడిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది..

Exit mobile version