Chiranjeevi leads ‘Run for Unity’ in Hyderabad | ‘రన్ ఫర్ యూనిటీ’లో చిరంజీవి సందడి

సర్థార్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘రన్ ఫర్ యూనిటీ’లో చిరంజీవి, అలీ, సైనా నెహ్వాల్ పాల్గొని సందడి చేశారు.

Chiranjeevi leads ‘Run for Unity’ in Hyderabad

విధాత, హైదరాబాద్ : ఉక్కు మనిషి, దేశ తొలి ఉప ప్రధాని సర్థార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఏక్తా దీవస్ సందర్బంగా నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ‘ఐక్యత రన్‌’ను నిర్వహించారు. ‘ఐక్యత రన్‌’ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీ హబ్ వద్ద నిర్వహించిన ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ రితిరాజ్, సినీ నటుడు అలీ పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి జూబ్లీ బస్ స్టేషన్ వరకు నిర్వహించిన ఐక్యత పరుగును భారత జట్టు మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, సైన నెహ్వాల్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో నగర వాసులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.