Chiranjeevi| ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి వ‌దిన‌మ్మ బ‌హుమ‌తి.. వీడియో షేర్ చేసిన చిరంజీవి

Chiranjeevi| జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప‌దవి ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఆయ‌న‌కి ప‌ద‌వులు ద‌క్క‌గా, ఈ రోజు నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లో అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి

  • Publish Date - June 15, 2024 / 08:01 PM IST

Chiranjeevi| జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప‌దవి ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఆయ‌న‌కి ప‌ద‌వులు ద‌క్క‌గా, ఈ రోజు నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లో అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందేనని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక ప‌వన్ క‌ళ్యాణ్‌ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. త‌న వ‌దినమ్మ కాళ్ల‌కి న‌మ‌స్కరించి బ్లెస్సింగ్స్ అందుకున్నారు.ఇక శాఖల కేటాయింపు తర్వాత కూడా పవన్‌ కళ్యాణ్ అన్న, వదినలను కలిశారు.

ఈ సందర్భంగా వదిన సురేఖ పవన్‌కు ఓ బహుమతిని అందించారు. దీనికి సంబంధించిన వీడియోను కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి పేరుతో చిరంజీవి తన సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అయితే పవన్‌ కళ్యాణ్‌కు సురేఖ ఏ బ‌హుమ‌తి ఇచ్చార‌ని అనుకుంటున్నారా.. ఓ ఖరీదైన పెన్నును పవన్‌కు బహుమతిగా అందించారు. ప‌వ‌న్ చొక్కాజేబులో ఆమె స్వ‌యంగా పెన్ ను పెట్ట‌డం మ‌న‌కు ఈ వీడియోలో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ప‌వన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన మోంట్ బ్లాంక్ పెన్ను అది అని తెలుస్తుంది. అద్బుతమైన బహుమతి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ చిరు దంపతులకు ధ్యాంక్స్ తెలిపారు. అలాగే తెలుగు ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తావని ఆశిస్తూ.. ఆశీర్వదిస్తూ అంటూ చిరు తన వీడియో చివరిలో రాసుకొచ్చారు.

ఇప్పుడు ఈ వీడియో అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. ఇక అదే పెన్నుతో తొలి సంతకం చేయాలంటూ వదినమ్మ కోరినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ పెన్నుతోనే పవన్ కూడా సంతకాలు పెట్టేలా కనిపిస్తున్నాడు. ఇక పవన్ కు ఇచ్చిన పెన్ గురించి నెట్టింట ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. ఆ ఇంపోర్టెడ్ పెన్ ధర దాదాపు రూ.80 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన మెగా ఫ్యామిలీ ప్రేమాభిమానాలు చూసి తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్.

Latest News