Rashmika Mandanna | అటల్‌ సేతుపై వీడియో విడుదల చేసిన రష్మిక మందన్నా..! స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన కాంగ్రెస్‌..!

Rashmika Mandanna | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఏడు దశల్లో లోక్‌సభల ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మరో మూడు దశలు మిగిలి ఉన్నాయి. అయితే, ఎన్నికల ప్రచారంలో తారలు మెరుస్తున్నారు. పలువురు ప్రత్యక్షంగా ఎన్నికల సభల్లో ప్రచారం చేయకపోయినా.. సోషల్‌ మీడియాలో వీడియోలు రిలీజ్‌ చేస్తూ వస్తున్నారు. తాగాజా రష్మిక మందన్నా సైతం అటల్‌ సేతు బ్రిడ్జిపై వీడియో రిలీజ్‌ చేసింది.

  • Publish Date - May 19, 2024 / 09:25 AM IST

Rashmika Mandanna | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఏడు దశల్లో లోక్‌సభల ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మరో మూడు దశలు మిగిలి ఉన్నాయి. అయితే, ఎన్నికల ప్రచారంలో తారలు మెరుస్తున్నారు. పలువురు ప్రత్యక్షంగా ఎన్నికల సభల్లో ప్రచారం చేయకపోయినా.. సోషల్‌ మీడియాలో వీడియోలు రిలీజ్‌ చేస్తూ వస్తున్నారు. తాగాజా రష్మిక మందన్నా సైతం అటల్‌ సేతు బ్రిడ్జిపై వీడియో రిలీజ్‌ చేసింది. వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సర్కారు పొగడ్తలతో ముంచేసింది. అయితే, ఈ వీడియోపై ప్రధానితో పాటు పార్టీ వర్గాలు స్పందించాయి. ఈ క్రమంలో రష్మికకు కాంగ్రెస్‌ పార్టీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ దాదర్‌ నుంచి నవీ ముంబయికి రెండున్నర గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాలకు తగ్గించిందంటూ రష్మిక చేసిన వీడియోపై తీవ్రంగానే స్పందించింది.

అయితే, వంతెనకు సంబంధించిన వాస్తవాలపై సైతం మరో వీడియో చేయాలని చెప్పింది. ఇప్పటి వరకు పెయిడ్‌ యాడ్స్‌.. సర్రోగేట్‌ యాడ్స్‌ మాత్రమే కనిపించేవని.. తాజాగా ఈడీ దర్శకత్వంలో వచ్చిన యాడ్‌ను సైతం చూస్తున్నామంటూ సెటైర్లు వేసింది. రష్మిక చేసిన వీడియోలో అటల్‌ సేతు వంతెన మొత్తం ఖాళీగా ఉన్నట్లు గమనించింది. కేరళ నుంచి వచ్చాం కాబట్టి.. ముంబయిలో ట్రాఫిక్‌ తక్కువగా ఉందని భావించామని.. ఇదే విషయాన్ని ముంబయి కాంగ్రెస్‌ మిత్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశామని పేర్కొంది. అటల్‌ సేతుతో పోలిస్తే రాజీవ్‌గాంధీ బాంద్రా- వర్లీ సీ లింక్‌ను వాహనదారులు ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పింది. ఈ మేరకు ఓ వీడియోను సైతం కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో పెట్టింది. వీడియో ఒక్కటే కాదని.. డేటాను సైతం పరిశీలించినట్లు కేరళ కాంగ్రెస్‌ పేర్కొంది.

రూ.1,634 కోట్ల వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన 5.6 కిలోమీటర్ల బాంద్రా-వర్లీ సీ లింక్‌ని 2009లో ప్రారంభించారని.. ఎఆంటి షో ఆఫ్‌ లేకుండా ప్రారంభించారని.. దాంతో వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారని.. ప్రతి కారుకు రూ.85 వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. అటల్‌ సేతును రూ.17,840 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు చెప్పింది. ఇక టోల్‌ రూ.250 వసూలు చేస్తున్నారని.. దీన్ని మధ్య తరగతి వారు భరించలేరని చెప్పింది. జనవరి 12న అటల్‌ సేతును ప్రారంభిస్తే.. ఏప్రిల్‌ 23 వరకు రూ.22.57కోట్లు మాత్రమే టోల్‌ వసూలైందని చెప్పింది. నెలకు రూ.6.6 చొప్పున మొత్తం పెట్టుబడి రూ.17,840కోట్లు వసూలు చేసేందుకు దాదాపు 225 సంవత్సరాలు పడుతుందని.. వడ్డీకి లెక్కలేదని పేర్కొంది. అటల్‌ సేతు నుంచి వాస్తవానికి రూ.30కోట్లు నెలకు వస్తాయని భావించారని చెప్పింది. ముంబయి వాసులు ఎందుకు ఈ అటల్‌ సేతును ఉపయోగించడం లేదో వీడియో చేస్తే బాగుంటుందంటూ నేషనల్‌ క్రష్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.

Latest News