Site icon vidhaatha

Prabhas | ప్రభాస్‌ను ఆ హీరోయిన్లు ఇద్దరు అంతగా ప్రేమించారా..? ఇంతకీ ఆ ఇద్దరు బ్యూటీలెవరో తెలుసా?

Prabhas | ప్రభాస్‌ (Prabhas)కు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక అమ్మాయిల్లో ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సలార్‌ (Salar), కల్కి (Kalki) మూవీలతో అభిమానులను అలరించాడు. తాజాగా ప్రభాస్‌ తన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రసుతం, ప్రభాస్‌ వయసు 44 సంవత్సరాలు. అయితే, డార్లింగ్‌ ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? అనే చర్చ సాగుతున్నది. ఎవరినైనా ప్రేమిస్తున్నాడా? ఆయనను ఎవరైనా ప్రేమిస్తున్నారా? అంటూ పలువురు ఆరా తీశారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రభాస్‌ను పలువురు హీరోయిన్లు ప్రేమించేందుకు ట్రై చేశారని టాక్‌. ఇందులో కొందరు కథానాయికలు ఇంకా ప్రేమిస్తున్నారని తెలుస్తున్నది. ముఖ్యంగా ఇద్దరు మీరోయిన్లు మాత్రం ఎంతోకాలంగా ప్రభాస్‌ను ప్రేమిస్తున్నారంటూ న్యూస్‌ తెగ వైరల్‌ అయ్యింది. ఆ ఇద్దరూ నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి ఊసెత్తకపోవడం డార్లింగ్‌ అంటేనే ఇష్టం కావొచ్చనే చర్చ సాగింది. ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో కాదు అనుష్క శెట్టి, త్రిష కృష్ణన్‌. ప్రభాస్‌కు జోడీగా త్రిష వర్షం, బుజ్జిగాడు, పౌర్ణమి మూవీల్లో నటించారు. ఇక అనుష్క శెట్టి బిల్లా, మిర్చీ, బాహుబలి సిరీస్‌లో నటించారు. అనుష్క శెట్టి, త్రిషతో ప్రభాస్‌ కాంబినేషన్‌ క్రేజీగా ఉందంటూ అభిమానులు సంబరపడిపోయే వారు.

అయితే, ప్రభాష్‌, అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. గతంలోనూ ప్రభాస్‌, అనుష్క లవ్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే, పెళ్లి వార్తలను ఇద్దరూ ఖండిస్తూ వచ్చారు. కేవలం తాము బెస్ట్‌ ఫ్రెండ్స్‌ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అలాగే, ప్రభాస్‌ – త్రిష జోడి సైతం ఓ రేంజ్‌లో ఉంటుందని పలువురు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేశారు. అయితే, ఏదీఏమైనా ప్రభాస్ అభిమానులు మాత్రం పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్‌ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version